Airbags: దేశంలో ఈ 5 చౌకైన కార్లకి 6 ఎయిర్‌బ్యాగ్‌లు..!

6 Airbags for These 5 Cheapest Cars in The Country | Best Cheapest Cars in India
x

Airbags: దేశంలో ఈ 5 చౌకైన కార్లకి 6 ఎయిర్‌బ్యాగ్‌లు..!

Highlights

Airbags: భారతీయ కస్టమర్లు తక్కువ ధరలో విలువైన ఫీచర్లను కోరుకుంటారు...

Airbags: భారతీయ కస్టమర్లు తక్కువ ధరలో విలువైన ఫీచర్లను కోరుకుంటారు. ఇప్పుడు అందరి దృష్టి కార్ల ఎయిర్ బ్యాగ్‌లపై పడింది. వినియోగదారులని ఆకట్టుకోవడానికి కంపెనీలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో 7-సీటర్ కార్లకు 3 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి. ఇటీవల 8-సీటర్ కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేశారు. అయితే కొన్ని కంపెనీలు ఇప్పుడు 5-సీటర్, 7-సీటర్ కార్లకి 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం ప్రారంభించాయి. అలాంటి 5 చౌకైన కార్ల గురించి తెలుసుకుందాం.

మారుతీ సుజుకి బాలెనో

మారుతీ సుజుకి భారతీయ కస్టమర్లకు ఇష్టమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. 2022 బాలెనోను ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.35 లక్షలతో విడుదల చేసింది. ఈ కారు టాప్ మోడల్ ధర రూ.9.49 లక్షలకు చేరుకుంది. మారుతి సుజుకి కొత్త కారుకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 20కి పైగా సేఫ్టీ ఫీచర్లను అందించింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.09 లక్షలు. ఇది ప్రస్తుతం 6 ఎయిర్‌బ్యాగ్‌లతో దేశంలోనే అత్యంత సరసమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్.

కియా కేరెన్స్ 7-సీటర్

Kia Carens అనేది 7-సీటర్ MPV. ఇది భారతదేశానికి వచ్చిన వెంటనే కస్టమర్ల హృదయాలను కొల్లగొట్టింది. 8.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో 3-వరుసల కార్లని కంపెనీ విడుదల చేసింది. సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, HAV, VSM, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, BAS, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు వంటి ఫీచర్లు ఇచ్చారు.

హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ i20 Astaలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.48 లక్షలు. టాప్ మోడల్ కోసం ఈ ధర రూ. 10.83 లక్షలకు చేరుకుంది. హ్యుందాయ్ i20 మూడు ఇంజన్ ఎంపికలతో అందిస్తున్నారు. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 83PS పవర్, 1.5-లీటర్ డీజిల్ 100PS పవర్, 120PS పవర్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి.

హ్యుందాయ్ i20 n లైన్

ఈ కారు నిజంగా బలమైన పనితీరు కోసం నిర్మించబడిన స్టాండర్డ్ i20 ఆధారంగా రూపొందించారు. దీంతో పాటు i20 భద్రతా లక్షణాలు ఇచ్చారు. ఇందులో టాప్ మోడల్ N8తో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇచ్చారు. ఈ శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ సాధారణ 1.0-లీటర్ TGDI టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను 6-స్పీడ్ IMT, 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో జత చేసింది. i20తో పోలిస్తే N లైన్ వెర్షన్ పూర్తిగా నలుపు రంగు ఇంటీరియర్‌తో వస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ

ఈ చిన్న సైజు ఎస్‌యూవీకి కస్టమర్లు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. హ్యుందాయ్ వెన్యూ టాప్ మోడల్ SX ఐచ్ఛికంతో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించింది. ఇది కాకుండా ఈ కాంపాక్ట్ SUVలో ABS విత్ EBD, ESC, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ కెమెరా, హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories