ఇంగ్లాండ్ చేరిన న్యూజిలాండ్ టీమ్.. టీం ఇండియా వెళ్లేది ఎప్పుడంటే..?

WTC Final Series New Zealand Cricketers Land in UK for Biosecure Tour of England
x

న్యూజిలాండ్ టీం ఆటగాళ్లు (ఫొటో ట్విట్టర్)

Highlights

WTC Final: జూన్ 18న ఇంగ్లాండ్‌ లో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీంల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే.

WTC Final Series: జూన్ 18న ఇంగ్లాండ్‌ లో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీంల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈమేరకు న్యూజిలాండ్ టీం ఇంగ్లాండ్ చేరుకుంది. అయితే, అంతకు ముందే న్యూజిలాండ్ టీం, ఇంగ్లాండ్ టీంతో జూన్ 2 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. నేటి నుంచి వారం రోజుల పాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితవ్వనున్నారు. ఈ ఏడు రోజుల్లో 3సార్లు కోవిడ్ టెస్టులు చేయనున్నారు. ఆ తరువాత ప్రాక్టీస్ మొదలు పెడతారని మేనేజ్‌మెంట్ పేర్కొంది. కాగా, డబ్యూటీసీ ఫైనల్ కోసం టీం ఇండియా జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరనుంది. అక్కడికి చేరుకున్నాక టీం ఇండియా కూడా కోవిడ్ నింబంధనలు పాటిస్తుంది.

బయో- సెక్యూర్ బబుల్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ల మధ్య టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తరువాత భారత్ జట్టు కూడా ఈ బబుల్‌లో వాతావరణంలోనే మ్యాచ్‌లు ఆడనున్నాయి. కాగా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టీంల మధ్య జూన్ 2న లార్డ్స్ లో మొదటి టెస్టు, జూన్ 10న బర్మింగ్‌హామ్‌‌ లో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జూన్ 18న న్యూజిలాండ్, ఇండియా టీంల మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. డబ్యూటీసీ ఫైనల్ తరువాత టీం ఇండియా, ఇంగ్లాండ్‌ టీంతో 5 టెస్టుల సిరీస్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు టూర్లకు సంబందించి 20 మందితో భారత జట్టును సెలెక్టర్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇంగ్లాండ్ వర్సెన్ న్యూజిలాండ్ షెడ్యూల్

మొదటి టెస్టు మ్యాచ్ - లార్డ్స్ లో జూన్ 2 నుంచి

రెండో టెస్టు మ్యాచ్ - బర్మింగ్‌హామ్‌ లో జూన్ 10 నుంచి

న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా డబ్యూటీసీ ఫైనల్ షెడ్యూల్

డ్యూటీసీ ఫైనల్ - సౌతాంప్టన్ లో జూన్ 18 నుంచి

ఇంగ్లాండ్ వర్సెన్ వర్సెస్ ఇండియా

తొలి టెస్టు మ్యాచ్ - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్ లో ఆగస్టు 4 నుంచి

రెండో టెస్టు మ్యాచ్ - లార్డ్స్, లండన్ లో ఆగస్టు 12 నుంచి

మూడో టెస్టు మ్యాచ్ - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్ లో ఆగస్టు 25 నుంచి

నాలుగో టెస్టు మ్యాచ్ - ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్హామ్ లో సెప్టెంబర్ 2 నుంచి

ఐదో టెస్టు మ్యాచ్ - ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్ లో సెప్టెంబర్ 10 నుంచి


Show Full Article
Print Article
Next Story
More Stories