Ind vs Pak Live Streaming: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌..200 దేశాల్లో లైవ్ స్ట్రీమింగ్‌

When, How to Watch Live Streaming T20 World Cup India VS Pakistan Match‌ Live Streaming
x

Ind vs Pak: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌.. 200 దేశాల్లో లైవ్ స్ట్రీమింగ్‌..

Highlights

* టీ20 ప్రపంచకప్‌లో మొద‌టిసారి ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌ర‌గ‌నుంది. ఈ రోజు దుబాయ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

Ind vs Pak: టీ 20 ప్రపంచకప్‌లో మొద‌టిసారి ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌ర‌గ‌నుంది. ఈ రోజు దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై ఈ రెండు దేశాలు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం దృష్టి నిలిచింది. ప్రపంచంలోని 200 దేశాల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరగడానికి కారణం ఇదే. ఇప్పటి వరకు 8 టీ 20 మ్యాచ్‌లు పాకిస్థాన్ ఇండియా మధ్య జరిగాయి.

ఇందులో టీమ్ ఇండియా ఏడు మ్యాచ్‌లు గెలిచింది. ప్రపంచకప్‌లో ప్రతిసారీ పాకిస్తాన్ ఓటమి చవిచూడాల్సి వస్తోంది. ఈ రోజు రెండు జట్లు రెండేళ్ల తర్వాత త‌ల‌ప‌డుతున్నాయి. 2019 లో వన్డే వరల్డ్ కప్‌లో చివరిసారిగా భారత్‌, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ పాకిస్థాన్‌ను భారీ తేడాతో ఓడించింది.

భారత్ తమ రెండు వార్మప్ మ్యాచ్‌లలో విజయం సాధించింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీం ఇండియా విజయం సాధించింది. పాక్ జట్టు ఒక మ్యాచ్‌లో గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. విండీస్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. రెండు పొరుగు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కారణంగా ఇరు జట్లు పరస్పరం ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదు. ఇంగ్లాండ్‌లో 2019 వన్డే ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్‌ జరిగింది.

T20 ప్రపంచ కప్ 2021 భార‌త్‌, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ని వివిధ భాషల్లో చూడవచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు.

జ‌ట్ల వివ‌రాలు:

భారత్:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్), హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్.

పాకిస్తాన్:

బాబర్ అజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది, హైదర్ అలీ.

Show Full Article
Print Article
Next Story
More Stories