World Cup 2023 Semifinal: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే.. లిస్టులో భారత్‌కు బద్ద శత్రువు..!

World Cup 2023 India And New Zealand May Enter Into Semi Final With Pakistan Australia And England May Suffer
x

World Cup 2023 Semifinal: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే.. లిస్టులో భారత్‌కు బద్ద శత్రువు..!

Highlights

World Cup 2023 Semifinal: ఇప్పటి వరకు భారత్, న్యూజిలాండ్ జట్లు ప్రపంచ కప్ 2023లో అజేయంగా ఉన్నాయి. దీంతో ఇరు జట్లు సెమీఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం.

India and New Zealand: ప్రపంచ కప్ 2023 క్రమంగా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటి వరకు ఆతిథ్య భారత్‌, గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌ మాత్రమే టోర్నీలో అజేయంగా నిలిచాయి. ఇరు జట్లు 4 మ్యాచ్‌లు ఆడగా, అన్నింటిలో జట్లు విజయం సాధించాయి. ఇరు జట్ల విజయ పరంపర కొనసాగుతుండడంతో ఈ రెండు జట్లు సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం అని స్పష్టమవుతోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి జట్ల పరిస్థితి మరీ దారుణంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం, న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ +1.923తో అగ్రస్థానంలో ఉంది. టీమ్ ఇండియా 8 పాయింట్లు, నెట్ రన్ రేట్ +1.659 తో రెండవ స్థానంలో ఉంది. టేబుల్‌లోని టాప్-4 జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. సెమీ-ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే ఏ జట్టు అయినా 9 లీగ్ మ్యాచ్‌లలో 7 గెలవాలి. ఇటువంటి పరిస్థితిలో, తదుపరి 5 మ్యాచ్‌లలో భారత్, న్యూజిలాండ్ 3 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.

కాగా, టోర్నీలో ఫేవరెట్‌గా చెప్పుకునే పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 3 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ 2 గెలుపొందగా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల్లో ఒక్కో మ్యాచ్ గెలిచాయి. మూడు జట్ల నెట్ రన్ రేట్ ప్రతికూలంగా ఉంది. దక్షిణాఫ్రికా జట్టు 3 మ్యాచ్‌లలో 2 గెలిచి మూడవ స్థానంలో ఉంది. జట్టు రన్ రేట్ కూడా సానుకూలంగా ఉంది.

భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్..

ఇప్పటి వరకు అజేయంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్లు అక్టోబర్ 22 ఆదివారం ధర్మశాలలో తలపడతాయి. ఇరుజట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఓ జట్టు విజయాల పరంపరకు బ్రేక్ పడనుంది. ఆదివారం ఏ జట్టు గెలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను భారత జట్టు ఓడించింది. అదే సమయంలో, న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్‌లలో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లను ఓడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories