ప్రపంచకప్‌-2011 : ఫైనల్లో ఇండియా శ్రీలంక మ్యాచ్‌ ఫిక్స్‌!.. విచారణ వేగవంతం

ప్రపంచకప్‌-2011 : ఫైనల్లో ఇండియా శ్రీలంక మ్యాచ్‌ ఫిక్స్‌!.. విచారణ వేగవంతం
x
Highlights

వన్డే ప్రపంచకప్‌-2011ఫైనల్‌ భారత్, శ్రీలంకల మధ్య జరిగిన టైటిల్‌ పోరు ఫిక్సయిందని శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలుత్గమగే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

వన్డే ప్రపంచకప్‌-2011ఫైనల్‌ భారత్, శ్రీలంకల మధ్య జరిగిన టైటిల్‌ పోరు ఫిక్సయిందని శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలుత్గమగే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మహిదానంద ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. దీనిపై దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు మాజీ మంత్రి మహిదానంద అలుత్‌గమగేను పోలీసులు విచారించారు.

స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిందనంద మాట్లాడుతూ..ప్రపంచకప్‌-2011లో భారత్‌, శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్సయిందని నేను అనుమానం వ్యక్తం చేశాను. నా అనుమానంపై విచారణ చేయాల్సిందిగా.. పోలీసులను కోరాను. అంతేకాకుండా ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్సయిందని అక్టోబర్‌ 30, 2011న ఐసీసీకి ఫిర్యాదు చేసిన కాపీని కూడా ఇచ్చాను' అని మహిదానంద వెల్లడించారు. ఓటమిపై ప్రజలు కలత చెందారని తెలుసు. దీనిపై ఏ చర్చకైనా నేను సిద్ధం అని అన్నారు.

మాజీ మంత్రి ఆరోపణలపైశ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలొస్తే చాలు... ఇలాంటి సర్కస్‌ చేష్టలకు కొదవుండదు. మరి ఫిక్సర్ల పేర్లు, ఆధారాలు చూపాలిగా' అని చురకలంటించాడు. కుమార సంగక్కర సాక్ష్యాధారాలు చూపాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ 97 పరుగులు , సారథి ధోని 91 నాటౌట్ యువరాజ్ సింగ్ 21పరుగులతో రాణించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories