Indian Cricket Team : పత్రీకారం తీర్చుకున్న భారత జట్టు.. బంగ్లాదేశ్ చిత్తు చేసిన యంగ్ ప్లేయర్స్

Indian Cricket Team : పత్రీకారం తీర్చుకున్న భారత జట్టు.. బంగ్లాదేశ్ చిత్తు చేసిన యంగ్ ప్లేయర్స్
x
Highlights

Indian Cricket Team : భారత అండర్-19 పురుషుల క్రికెట్ జట్టు ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్ టైటిల్‌ను కోల్పోయింది. భారత్‌ను ఓడించి బంగ్లాదేశ్‌ ఈ...

Indian Cricket Team : భారత అండర్-19 పురుషుల క్రికెట్ జట్టు ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్ టైటిల్‌ను కోల్పోయింది. భారత్‌ను ఓడించి బంగ్లాదేశ్‌ ఈ టైటిల్‌ను రెండోసారి గెలుచుకుంది. అయితే ఇప్పుడు భారత మహిళల అండర్-19 జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం, ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ రెండు దేశాల అండర్-19 జట్ల మధ్య జరిగింది. ఇందులో బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం సాధించింది. ఇప్పుడు భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. ఆటగాళ్లు టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించారు. ఈ ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

మహిళల అండర్-19 ఆసియా కప్ 2024 టీ-20 ఫార్మాట్‌లో జరిగింది. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన గొంగడి త్రిష అత్యధిక పరుగులు చేసింది. ఫైనల్‌కు ముందు శ్రీలంక ప్లేయర్ మనుడి నానయక్కర అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచారు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా త్రిష తొలి మహిళల అండర్-19 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌లో మొత్తం 159 పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో ఆమె 47 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు సాధించారు.

బౌలింగ్ విషయంలోనూ భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఫైనల్‌కు ముందు భారత్‌కు చెందిన ఆయుషి శుక్లా, బంగ్లాదేశ్‌కు చెందిన నిషితా అక్తర్ 7 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. అయితే ఫైనల్లో 17 ఏళ్ల ఆయుషి మూడు వికెట్లు తీసింది. 10 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, ఫైనల్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన నిషితా అక్తర్ రెండు వికెట్లు పడగొట్టింది. ఆసియా కప్‌లో మొత్తం 9 వికెట్లు తీశారు

ఇదీ ఫైనల్‌ పరిస్థితి

మహిళల అండర్ 19 ఆసియా కప్ చివరి మ్యాచ్‌లో తక్కువ స్కోరింగ్ నమోదైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. త్రిష హాఫ్ సెంచరీ చేసింది. ఫర్జానా ఎస్మిన్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19వ ఓవర్లో 76 పరుగులకే కుప్పకూలింది. భారత్ తరఫున ఆయుషి మూడు వికెట్లు తీయగా, పరుణికా సిసోడియా, సోనమ్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories