Kohli Fan: కింగ్ కోహ్లీ కోసం అభిమాని ఏం చేశాడంటే..?

What Did Kohli Fan Done for Virat kohli
x

Kohli Fan: కింగ్ కోహ్లీ కోసం అభిమాని ఏం చేశాడంటే..

Highlights

Kohli Fan: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ను చూసేవారిలో విరాట్ కోహ్లీ అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. ఆయనకు ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. కేవలం కోహ్లీ ఆట చూసేందుకే ఓ వీరాభిమాని 8వేల మైళ్ల దూరం నుంచి వచ్చాడు. ఆ అభిమాని కోసమే అన్నట్లు కోహ్లీ ఏం చేశాడంటే..

Kohli Fan: ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు.. భారత్ లో క్రికెట్ ను ఒక మతంగా కొలుస్తారు.. క్రికెట్ ఆడే ఆటగాళ్లను దేవుళ్లుగా కొలుస్తారు. ఒకప్పుడు సచిన్ అంటే అందరూ ఇష్టపడేవారు.. ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. కింగ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఎందరో తమ ఒంటిపై కోహ్లీ చిత్రాన్ని టాటూగా వేసుకున్నారు. ఒక యువకుడు అయితే గోడపై 60 అడుగుల విరాట్ కోహ్లీ పెయింటింగ్ వేశాడు. సినీ హీరోలకే పరిమితం అయిన కటౌట్ల సాంప్రదాయం కోహ్లీ కారణంగా క్రికెట్ లోకి సైతం చేరింది. టీమిండియా రన్ మెషీన్ భారీ కటౌట్లను అభిమానులు ఏర్పాటు చేశారు. ఒక వీరాభిమాని అయితే కోహ్లీకి పాదాభివందనం చేశాడు కూడా. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఓ వ్యక్తి చూపించిన అభిమానం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఉప్పల్ స్టేడియానికి క్యూ కట్టారు. అయితే ఈ మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ఓ వ్యక్తి చేతిలోని ప్లకార్డ్ అందర్ని ఆకట్టుకుంది. ఇంతకీ ప్లకార్డ్ లో ఏముందంటే.. ఓర్లాండ్ టు హైదరాబాద్..కోహ్లీ ఆట చూసేందుకు 8,985 మైళ్ల దూరం ప్రయాణించి వచ్చానంటూ ఆ అభిమాని ప్లకార్డ్ ను ప్రదర్శించాడు. ఈ ప్లకార్డ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

కింగ్ కోహ్లీ బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు ఆ అభిమాని ఓర్లాండ్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ఆ అభిమాని ఆశకు తగ్గట్టే ఈ మ్యాచ్ లో కోహ్లీ వీర విహారం చేశాడు. అభిమాని చేతిలోని ప్లకార్డ్ ను కోహ్లీ చూశాడో ఏమోకానీ..ఉప్పల్ స్టేడియంలో విరాట్ పర్వం ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్ లో 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో కోహ్లీ శతకొట్టేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories