భారత్ పర్యటనకు గేల్ దూరం

భారత్ పర్యటనకు గేల్ దూరం
x
chris gayle
Highlights

గేల్ చివరి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఎంజాన్సీ సూపర్‌ లీగ్‌లో ఆడాడు. ఈ టోర్నిలో గేల్ 6 ఇన్నింగ్స్ లో కేవలం 101 పరుగులు మాత్రమే చేసి విఫలమైయ్యాడు.

విండీస్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌ కొంత కాలం క్రికెట్ నుంచి రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకునారు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్‌ బోర్డుకు తెలిపాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో భారత పర్యటనకు క్రిస్ గేల్ దూరం కానున్నాడు. 2020 టీ20 వరల్డ్ కప్‌లో లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

వచ్చే నెలలో విండీస్ జట్టు భారత్ లో పర్యటించనుంది. టీమిండియా వెస్టిండీస్‌ మధ్య 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సంవత్సరం జరిగే ఏ మెగా టోర్నిలోనూ గేల్ ఆడే అవకాశం కనిపించడం లేదు. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్, బంగ్లా ప్రీమియర్‌ లీగ్‌లకు క్రిస్ గేల్ దూరం కానున్నాడు.

తనను తాను 'రీచార్జ్‌' చేసుకొని వచ్చే ఏడాది ఆడడంపై నిర్ణయం తీసుకుంటానని స్ఫష‌్టం చేశాడు‌. గేల్ చివరి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఎంజాన్సీ సూపర్‌ లీగ్‌లో ఆడాడు. ఈ టోర్నిలో గేల్ 6 ఇన్నింగ్స్ లో కేవలం 101 పరుగులు మాత్రమే చేసి విఫలమైయ్యాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories