Mohammad Azharuddin: ఉద్దేశ్య పూర్వకంగా నాకు నోటీసులు

Wantedly Apex Council Issues Showcause Notice says President Azharuddin
x

అజారుద్దీన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Mohammad Azharuddin: ఉద్దేశపూర్వకంగా అపెక్స్ కౌన్సిల్ సభ్యులు నాకు నోటీసులు జారీచేశారని హెచ్ సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పారు.

Mohammad Azharuddin: ఉద్దేశపూర్వకంగా అపెక్స్ కౌన్సిల్ సభ్యులు నాకు నోటీసులు జారీచేశారని హెచ్ సిఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. అలాగే తానెప్పుడూ హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించలేదని, వ్యతిరేకంగా పనిచేయలేదని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌ లో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారని, కేవలం 5గురు సభ్యులు (జాన్ మనోజ్, విజయనంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ) ఓ వర్గంగా ఏర్పడి ఇదంతాచేస్తున్నారని మండిపడ్డారు. వారు చేసిందే అపెక్స్‌ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీఏ లో జరుగుతున్న.. అలాగే ఇదివరకు జరిగిన అవినీతిని అరికట్టేందుకు సమర్థవంతమైన ఓ వ్యక్తిని అంబుడ్స్‌ మెన్‌గా నియమిస్తే.. ఈ వర్గమే తప్పు పట్టిందని, దానికి కారణం వాళ్ల తప్పులు ఎక్కడ బయటపడతాయనే భయపడుతున్నారుని ఆరోపించారు. అందుకే నాపై కక్ష్య కట్టి ఇలా చేస్తున్నారని వాపోయారు.

అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తే.. ఆ అయిదుగురు సభ్యులు హాజరు కారని అజారుద్దీన్ ఆరోపించారు. ఈ ఐదుగురిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. వీరి అవినీతికి నేను అడ్డుపడుతున్నాననే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఐదుగురే మీటింగ్ పెట్టుకుని.. నాకు నోటీసులు పంపించారని, పైగా ఈ నోటీసులు అపెక్స్ కౌన్సిల్ ఇచ్చినట్టుగా మీడియాకు చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories