ఆ రెండుసార్లు కన్నీళ్లు ఆగలేదు: ల‌క్ష్మ‌ణ్‌

ఆ రెండుసార్లు కన్నీళ్లు ఆగలేదు: ల‌క్ష్మ‌ణ్‌
x
Highlights

ఇటీవల టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో 2-1తో చరిత్రాత్మక విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన...

ఇటీవల టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో 2-1తో చరిత్రాత్మక విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన బ్రిస్బేన్ టెస్ట్‌ విజ‌యంపై టీమిండియా మాజీ క్రికెట‌ర్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ స్పందించారు. భారత్ జట్టు మ్యాచ్ గెలిచిన అనంతరం తాను కంట‌త‌డి పెట్టిన‌ట్లు తాజాగా ల‌క్ష్మ‌ణ్‌ చెప్పారు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ... 'బ్రిస్బేన్ తో విజయం గొప్పది. నేను కూడా మ్యాచ్ చూస్తూ భావోద్వేగానికి లోన‌య్యాను. చివ‌రి రోజు మ్యాచ్ చూశాను. రిషబ్ పంత్‌, వాషింగ్టన్ సుందర్ ఆడుతున్న స‌మ‌యంలో చాలా ఆందోళ‌న‌కు గుర‌య్యాను.మ్యాచ్ గెల‌వ‌గానే ఏడ్చేశాను' అని చెప్పుకొచ్చారు.

బ్రిస్బేన్‌కు వెళ్లడానికి భారత్ భయపడుతోందని, ఎందుకంటే.. అక్కడ ఆస్ట్రేలియా 32 ఏళ్లుగా ఓడిపోలేదన్నారు. కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాపై గెలవాల‌న్న‌ది నా క‌ల‌. ఓ క్రికెట‌ర్‌గా అది నాకు తీర‌ని కోరిక‌గానే మిగిలిపోయిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. క్రికెట్ చూస్తూ నేను కంట‌త‌డి పెట్టింది రెండుసార్లే. ఇంత‌కుముందు 2011 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన‌ప్పుడు కూడా ఇలాగే జ‌రిగింది. లక్ష్మ‌ణ్ టీమిండియా తరఫున 134 టెస్టులు, 86 వన్డేలు ఆడారు. ఇక శుక్రవారం నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.

ఈ మ్యాచ్‌లో 328 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి రోజు డ్రా చేసుకుంటే గొప్పే అనుకున్న పోరులో నయావాల్ పుజారా, యువ ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ ( 91), యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (89) అద్భుతంగా పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 32 ఏళ్లుగా ఓట‌మే ఎరుగ‌ని గ‌బ్బాలో ఆస్ట్రేలియాను చిత్తుచేసి సిరీస్‌ను గెల‌వ‌డం భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేనిదే.


Show Full Article
Print Article
Next Story
More Stories