బీసీసీఐ క్వారంటైన్ చూసుకో..నాలుగో టెస్టు ఆడడానికి నేను రెడీ: సెహ్వాగ్

బీసీసీఐ క్వారంటైన్ చూసుకో..నాలుగో టెస్టు ఆడడానికి నేను రెడీ: సెహ్వాగ్
x

సెహ్వాగ్ ఫైల్ ఫోటో

Highlights

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ సరదాగా స్పందించాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు గాయాల బెడద వెంటాడుతుంది. ఒకరి తర్వాత ఒకరు వరుసగా గాయలుబారీన పడడం భారత జట్టు మెనేజ్ మెంట్ ను కలవర పెడుతుంది. టూర్‌కు మొత్తంగా దూర‌మైన వాళ్లు, మ‌ధ్య‌లో గాయ‌ప‌డి వెళ్లిపోయిన వారి సంఖ్య దాదాపు ఎనిమిదికి చేరింది. మూడో టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ కోలుకున్నాడు. తాజాగా జ‌స్‌ప్రీత్ బుమ్రా కూడా గాయ‌ప‌డ్డాడు. ఉద‌ర కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అత‌డు నాలుగో టెస్ట్‌కు దూర‌మ‌య్యాడు. హనుమ విహారి కూడా తొడ కండరాల్లు పట్టేయడంతో నాలుగో మ్యాచ్ కు డౌటే.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ సరదాగా స్పందించాడు. ట్వీట్‌కు బుమ్రా, షమీ, ఉమేష్, రాహుల్, జడేజా, విహారి పోటోలను జతచేస్తూ... తదుపరి( బ్రిస్బేన్) టెస్టుకు టెస్టుకు 11 మంది ఫిట్‌గా లేకపోతే.. ఆస్ట్రేలియాకు వెళ్లి ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ వ్యాఖ్యానించాడు. 'ఇంతమంది ఆటగాళ్లు గాయపడ్డారు. బ్రిస్బేన్ టెస్టుకు 11 మంది ఫిట్‌గా లేకపోతే.. ఆస్ట్రేలియాకు వెళ్లి ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బీసీసీఐ.. క్వారంటైన్ చూసుకో' అని సెహ్వాగ్ చమత్కరించాడు.

ప్రస్తుతం నాలుగు టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ జనవరి 15 నుంచి గబ్బాలో ప్రారంభం కానుంది. గాయాల నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేయడం భారత టీమ్‌మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలొనొప్పిగా మారనుంది. ప్రస్తుతానికి రోహిత్ శర్మ, చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షా, ఆర్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, టీ నటరాజన్, కుల్దీప్ యాదవ్‌, శార్దుల్ ఠాకుర్‌లు మాత్రమే అందుబాటలో ఉన్నారు. ఇక మయాంక్ అగర్వాల్ నివేదికలు రావాల్సి ఉంది.

స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇటీవలే కోలుకొని జట్టులోకి వచ్చాడనుకుంటే.. మరోవైపు గాయాలతో స్టార్ ఆటగాళ్లంతా ఒక్కక్కరుగా దూరమవుతున్నారు. భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జ‌స్‌ప్రీత్ బుమ్రా గాయాలతో ఆటకు దూరమయ్యారు. రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ సైతం గాయపడినా నెట్టుకొస్తున్నారు. నాలుగో టెస్ట్ లోపు ఎంత మంది ఫిట్‌గా ఉంటారో లేదో తెలియదు.


Show Full Article
Print Article
Next Story
More Stories