బుడ్డోడి బ్యాటింగ్‌కు ముగ్థుడైన కోహ్లీ.. టీమ్‌లోకి తీసుకోవాలన్న పీటర్సన్

బుడ్డోడి బ్యాటింగ్‌కు ముగ్థుడైన కోహ్లీ.. టీమ్‌లోకి తీసుకోవాలన్న పీటర్సన్
x
Virat Kohli And Kp
Highlights

టిక్‌టాక్, ఇన్ స్టాగ్రామ్ పుణ‌్యమా అని సామాన్యులు సైతం స్టార్స్‌గా మారిపోతున్నారు. మొన్నా మధ్య టిక్‌టాక్ స్టార్ ఒకరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ...

టిక్‌టాక్, ఇన్ స్టాగ్రామ్ పుణ‌్యమా అని సామాన్యులు సైతం స్టార్స్‌గా మారిపోతున్నారు. మొన్నా మధ్య టిక్‌టాక్ స్టార్ ఒకరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే, ఇక మరోకరు సినిమాల్లో అవకాశం సంపాదించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు టిక్‌టాక్ వల్ల ఫాలోవర్స్‌ను సంపాదించడమే కాకుండా సెలబ్రీటిలుగా మారుతున్నారు.

తాజాగా ఓ బుడ్డోడు డైపర్ వేసుకుని బ్యాటింగ్‌లో ఇరగతీస్తున్న వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇక వీడియో కాస్త టీమిండియా కెప్టెన్ కోహ్లీని సైతనం మంత్రముగ్థుడిని చేసింది. ఈ వీడియోను చూసిన కోహ్లీ ఆ బుడ్డోడు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిని కనబరిచారు.

ఈ వీడియోలో ఓ చిన్నారి ప్లాస్టిక్‌ బ్యాట్‌ పట్టి స్ట్రైట్‌ డ్రైవ్‌లు, కవర్‌ డ్రైవ్‌లు ఆడుతున్నాడు. కాగా, దీనిని ఇంగ్లాండ్‌ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియోను కాస్త భారత జట్టు సారథి విరాట్ కోహ్లీని ట్యాగ్‌ చేశాడు. కెవిన్ పీటర్సన్ ఆ వీడియోకు క్యాషన్ పెట్టాడు. విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్న బుడ్డోడిని భారత జట్టులో చేర్చుకుంటావా అని పోస్టు చేశాడు. దీనిపై స్పందించిన ఆ చిన్నారి ప్రతిభ నమ్మశక్యంగా లేదు... అతను ఎక్కడుంటాడని కోహ్లీ ప్రశ్నించాడు.

మూడు టీ20లు మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ జట్టు భారత్ లో పర్యటించింది. మూడు టీ20 సిరీస్ ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆదివారం జరిగిన మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డే భారత్ జట్టుకు భారీ షాక్ తగిలింది. మొదటి వన్డేలో భారత్ నిర్దేశించిన 288 పరుగుల విజయ లక్ష్యాన్ని విండీస్ ఆడుతూపాడుతూ ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేస్తే.. 47.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ 291 చేసి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో మ్యాచ్ విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా విండీస్ 1-0తో ముందజలో ఉంది. మొదటి వన్డేలో కీలక బ్యాట్స్ మెన్ చేతులేత్తేయగా.. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన పంత్ ను తప్పించి, రిజర్వ్ ఆటగాడు సంజు శాంసన్ ను ఆడించాలని సీనియర్లు సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, పంత్ ఫామ్ లో రావడమే కాకుండా గత మ్యాచ్ లో అతడే కీలకంగా మారాడు.


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

WHAT?!?!?!?!?! Get him in your squad, @virat.kohli! Can you pick him?!?! 😱

Kevin Pietersen (@kp24) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories