Virat Kohli: చివరి స్థానంలో విరాట్ కోహ్లీ... ఏ రికార్డులోనో తెలుసా...

Virat Kohli Placed in Last in Toss Winning
x

విరాట్ కోహ్లీ (ఫొటో ట్విట్టర్)

Highlights

Virat Kohli: ఓ రికార్డులో కోహ్లీ చివరి స్థానంలో నిలిచాడు. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా... అయితే చదవండి మరి.

Virat Kohli: అదేంటి... సూపర్ బ్యాటింగ్‌తో రికార్డులు క్రియోట్ చేస్తున్న విరాట్ కోహ్లీ... చివరి స్థానంలో ఉండడమేంటని అనుకుంటున్నారా? అవునండీ.. మీరు చదివింది నిజమే! అదేనండి టాస్ విషయంలో... టాస్ విషయంలో కోహ్లీ ని దురదృష్టం వెంటాడుతోంది. ఇంగ్లాండ్ తో జరిగిన అన్ని పార్మెట్లలో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాతో పాటు మాజీలు కూడా జోకులు పేలుస్తున్నారు.

అత్యవసరంగా టాస్‌ వేసే కాయిన్ ను మార్చండని రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌కు టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌ అభ్యర్థించాడు. టాస్‌ కోసం వేరే వ్యక్తిని తీసుకు రావాల్సిన సమయం ఇదంటూ ఇలా ఫన్నీ ట్వీట్స్ చేస్తున్నారు. కోహ్లీ టాస్ గణాంకాలను ఓ సారి పరిశీలిస్తే.. విషయం అర్థమవుతోంది.

ఇంగ్లాండ్‌ సిరీస్‌ మొత్తం మీద టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కలిపి విరాట్ కేవలం 2 సార్లు మాత్రమే టాస్‌ గెలవగలిగాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో పూణె వన్డేలోనూ అతడికి టాస్ కలిసి రాలేదు. టెస్టుల్లో ఒకసారి, టీ20ల్లో ఒకసారి మాత్రమే అతను టాస్‌ గెలిచాడు. ఇక ఈ మధ్య కాలంలో 12 మ్యాచ్ ల్లో టాస్ లు వేయగా... 10 సార్లు కోహ్లీకి నిరాశే ఎదురైంది.

ఇంగ్లాండ్‌పై అన్ని ఫార్మాట్లలో 35 మ్యాచ్ ల్లో కేవలం 8 సార్లు మాత్రమే టాస్‌ గెలిచాడు మన కెప్టెన్. ఓవరాల్ గా ఇప్పటి వరకు 200 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో టీమిండియాకు సారథ్యం వహించిన విరాట్ 115 సార్లు టాస్‌ ఓడిపోయాడు. 85 సార్లు మాత్రమే టాస్ గెలిచాడు. కోహ్లీ కెరీర్‌ లో టాస్‌ గెలుపు 45 శాతమే. ఈ విషయంలో మిగిలిన టీం కెప్టెన్లందరిలోనూ కోహ్లీదే చివరి స్థానం.

గతంలో దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ కు ఇలాగే టాస్ కలిసి రాలేదు. దీంతో ఓ మ్యాచ్‌లో తోటి ఆటగాడు డుమినితో టాస్‌ వేయించి గెలిచాడు. ఇప్పుడు కోహ్లి కూడా ఇలా చేయాలేమో అని అభిమానులు అంటున్నారు. వీటితో పాటు షోలే సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ వాడే రెండు వైపులా ఒకేలా ఉండే నాణాన్ని కోహ్లీకి ఇవ్వండని నెటిజన్లు కోరుతున్నారు.

విరాట్ కోహ్లీ టాస్ ఎలా గెలవాలో నరేంద్ర మోడీ కూడా పుస్తకాల్లో వెతుకుతున్నారంట....!

విరాట్, టాస్ ఎప్పుడూ కలిసి నడవడం లేదంట...

విరాట్ టాస్ కి వెళ్లే ముందు డ్రెస్సింగ్ రూమ్ లో...

ప్రతీసారి టాస్ కి వెళ్లే ముందు భారత ప్రజలంటూ ఓట్వీట్...

విరాట్ టాస్ ఎప్పుడు గెలుస్తాడోనని వెయిటింగ్ ఇక్కడ...


Show Full Article
Print Article
Next Story
More Stories