ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కొహ్లీ, బుమ్రా టాప్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కొహ్లీ, బుమ్రా టాప్
x
Highlights

న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా 4-1తో విజయం సాధించడం ద్వారా వన్డే క్రికెట్లో రెండో ర్యాంక్ ను మరింత పదిలం చేసుకోగలిగింది. ఆటగాళ్ల...

న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా 4-1తో విజయం సాధించడం ద్వారా వన్డే క్రికెట్లో రెండో ర్యాంక్ ను మరింత పదిలం చేసుకోగలిగింది. ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా బ్యాట్స్ మన్, బౌలర్ల విభాగాలలో టాప్ ర్యాంక్ లను నిలబెట్టుకొన్నారు. లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ప్రస్తుత ఆరో ర్యాంక్ నుంచి 5వ ర్యాంక్ కు చేరితే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ మూడుస్థానాల మేర మెరుగుపరచుకొని 17వ స్థానానికి చేరుకొన్నాడు. ఐసీసీ టీమ్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఇంగ్లండ్ 126 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో జరిగిన సిరీస్ ల్లో విజేతగా నిలవడం ద్వారా టీమిండియా 122 పాయింట్లతో రెండోస్థానాన్ని నిలబెట్టుకోగలిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories