లాక్‌డౌన్‌లో పెరిగిన కోహ్లీ ఆదాయం

లాక్‌డౌన్‌లో పెరిగిన కోహ్లీ ఆదాయం
x
Virat Kohli(File photo)
Highlights

ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించిన భారత క్రీడాకారుల్లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నా వారిలో విరాట్‌ కోహ్లీనే టాప్ ప్లేస్ లో నిలిచాడు.

ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించిన భారత క్రీడాకారుల్లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్నా వారిలో విరాట్‌ కోహ్లీనే టాప్ ప్లేస్ లో నిలిచాడు.ఇటీవల కూడా ఈ జాబితాలో రూ. 196 కోట్ల ఆదాయంతో కోహ్లి 66వ స్థానంలో నిలిచాడు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఏకంగా 34 స్థానాలు ఎగబాకాడు. టాప్‌–100లో నిలిచిన ఏకైక క్రికెటర్, భారత్‌ నుంచి ఏకైక క్రీడాకారుడు కోహ్లినే కావడం విశేషం.

లాక్‌డౌన్‌లోనూ విరాట్‌ ఆదాయం ఏ మాత్రం తగ్గలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్డ్‌ పోస్టుల ద్వారా అతను దాదాపుగా 3.63 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించాడు. మార్చి 12 నుంచి మే 14 వరకు లాక్‌డౌన్‌ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అత్యధిక సంపాదించిన ప్రపంచ అథ్లెట్లలో అతను ఆరో స్థానంలో నిలిచాడు. పోస్టుకు కోటి 21 లక్షల రూపాయలు చొప్పున విరాట్‌ ఖాతాలో చేరింది. ఆ తరువాత ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్లు రొనాల్డో (పోర్చుగల్‌ రూ.17 కోట్లు), మెస్సి (అర్జెంటీనా, రూ.11 కోట్లు), నెయ్‌మార్‌ (బ్రెజిల్‌, 10 కోట్ల రూపాయలతో ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories