IPL 2023: సెంచరీ చేసి దాదాకు అంకితం ఇవ్వు.. విరాట్ కోహ్లీని కోరిన శ్రీశాంత్.. వీడియో వైరల్..
Sreesanth: ఐపీఎల్ 2023 సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ అందర్ని ఆకట్టుకుంటున్నాడు.
Sreesanth: ఐపీఎల్ 2023 సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ అందర్ని ఆకట్టుకుంటున్నాడు. టీ20ల్లో నంబర్ వన్ గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్య కేవలం క్రికెటర్ కాదు అని అతనో గొప్ప గణిత శాస్త్రాజ్ఞుడు అని శ్రీకాంత్ పొగిడాడు. అందరూ ఆకాశమే హద్దు అంటారు కానీ సూర్యకి హద్దే లేదంటూ ఆకాశానికి ఎత్తేశాడు. శ్రీశాంత్ మాటలను ఎవరూ మర్చిపోకముందే మరోసారి ఇలాంటి తరహా వ్యాఖ్యలే చేశాడు. అయితే ఈసారి విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ చేశాడు.
ఢిల్లీ వేదికగా ఢల్లీ క్యాపిటల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తలపడేందుకు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో విరాట్ సెంటరీ సాధించి గంగూలీకి అంకితమివ్వాలని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ-బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ 50వది. అంటే గోల్డెన్ మ్యాచ్. దీనికి శ్రీకాంత్ కామెంటేటర్ గా వ్యవహరించనున్నాడు.
గతంలో బెంగళూరు, ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు విరాట్ కోహ్లీ ఇష్టపడలేదు. ఆ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేసింది. ఈ నేపధ్యంలో తాజాగా శ్రీశాంత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి శ్రీశాంత్ కోరికను విరాట్ కోహ్లీ తీరుస్తాడో లేదో చూడాలి.
'@ImVKohli getting a 100 will be a great tribute to Dada', @sreesanth_36 anticipates a great #RivalryWeek clash between @DelhiCapitals & @RCBTweets!
— Star Sports (@StarSportsIndia) May 6, 2023
Tune-in to #DCvRCB at #IPLonStar
Today | Pre-show at 7 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#BetterTogether pic.twitter.com/CxzBgDh6vr
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire