Kohli-Gambhir: టీమిండియా ఫ్యాన్స్ కోరుకున్న సీన్ ఇదే కదా భయ్యా.. నెట్టింటిని షేక్ చేస్తోన్న విరాట్-గంభీర్ ఫొటో

Virat Kohli and Gautam Gambhir Photo goes viral in Team India Practice Session IND vs SL Odi Series
x

Kohli-Gambhir: టీమిండియా ఫ్యాన్స్ కోరుకున్న సీన్ ఇదే కదా భయ్యా.. నెట్టింటిని షేక్ చేస్తోన్న విరాట్-గంభీర్ ఫొటో

Highlights

IND vs SL: T20 ప్రపంచ కప్ 2024 తర్వాత, మైదానంలో రోహిత్-విరాట్ జోడీని చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఆగస్టు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. గతంలో విరాట్ కోహ్లి, కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

Virat Kohli and Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వ్యవహారం ప్రపంచం అంతా తెలిసిందే. కొన్నాళ్ల క్రితం మొదలైన ఈ నిప్పురవ్వ భారీ మంటలా మారింది. అయితే, ఐపీఎల్ 2024లో ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందని అభిమానులు ఎదురుచూశారు. ఈ క్రమంలో గంభీర్-కోహ్లీ మైదానం మధ్యలో కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు టీమిండియా కొత్త కోచ్‌గా గంభీర్ ఆధ్యర్వంలో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. భారత్‌-శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌కు ముందు గంభీర్‌, విరాట్‌ల ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ సృష్టించగా.. దీన్ని చూసిన అభిమానులు రకరకాలుగా రియాక్షన్‌లు ఇస్తూ కనిపిస్తున్నారు.

విరాట్-గంభీర్‌ల ఫొటో..

విరాట్-గంభీర్‌ల ఫొటో అభిమానులలో ప్రకంపనలు సృష్టించింది. ఎందుకంటే, ఇద్దరు ఆటగాళ్ల మధ్య కనిపించిన స్నేహం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఫొటోలో, విరాట్ చెప్పిన దానికి గంభీర్ బిగ్గరగా నవ్వుతూ కనిపించాడు. ఈ ఫొటోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, వెంటనే వైరల్‌గా మారింది. 'ఒకే ఓవర్‌లో హ్యాట్రిక్ సాధిస్తానని కోహ్లీ చెబుతున్నాడంటూ ఓ యూజర్ కామెంట్‌లో రాసుకొచ్చాడు.

టీ20 సిరీస్‌ భారత్ కైవసం..

టీ20 సిరీస్‌లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20లో జట్టు కెప్టెన్సీని సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించారు. స్కై కెప్టెన్‌గా అద్భుతంగా బ్యాటింగ్ చేసి శ్రీలంకను చిత్తుగా ఓడించాడు. ఇప్పుడు ఆగస్టు 2 నుంచి ఇరు జట్లు వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి. రోహిత్-కోహ్లీ కూడా ఇక్కడ యాక్షన్‌లో కనిపించనున్నారు.

శ్రీలంకతో వన్డే భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.


Show Full Article
Print Article
Next Story
More Stories