Virat - Anushka: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సిడ్నీ వీధుల్లో విరాట్ - అనుష్క దంపతుల చక్కర్లు..

Virat Kohli And Anushka Sharma Spotted On The Streets Of Sydney For A New Year Party
x
Highlights

Virat - Anushka: బోర్డర్-గవస్కర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉండడంతో అక్కడే నూతన సంవత్సరం వేడుకలను జరుపుకున్నారు.

Virat - Anushka: బోర్డర్-గవస్కర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉండడంతో అక్కడే నూతన సంవత్సరం వేడుకలను జరుపుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో టీమిండియా క్రికెటర్లు న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. అయితే న్యూ ఇయర్ వేళ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సిడ్నీ వీధుల్లో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్టార్ కపుల్ న్యూ ఇయర్ పార్టీ కోసం బ్లాక్ డ్రెస్‌లలో కనిపించారు. విరాట్, అనుష్క ఒకరి చేయి ఒకరు పట్టుకుని వీధుల్లో నడవడం వీడియోలో ఉంది. ఈ వీడియోలో విరాట్, అనుష్కలకు కొద్ది దూరంలో దేవదత్ పడిక్కల్ కూడా ఉన్నారు. వారితో పాటు యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ కూడా ఉన్నాడు. ఈ వీడియోను విరాట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ చేస్తుండడంతో వైరల్‌గా మారింది.

ఇటీవలే మెల్ బోర్న్‌లో నాలుగు టెస్టులు ముగిశాయి. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఐదో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలోనే టీమిండియా ఇప్పటికే సిడ్నీ చేరుకుంది. అక్కడే క్రికెటర్స్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు.

ఇదిలా ఉంటే బీజీటీ సిరీస్‌లో రోహిత్ సేన అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులోనూ భారత్ ఘోర ఓటమి చవిచూసింది. దాంతో టీమిండియాపై విమర్శలు మరింత పెరిగాయి. ఇప్పటికే 2-1 సిరీస్‌లో భారత జట్టు వెనుకబడింది.

సీనియర్లు విరాట్, రోహిత్ శర్మపై మాజీలు పెదవి విరుస్తున్నారు. జట్టుకు అండగా ఉండాల్సిన వీరిద్దూ భారంగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఒక అడుగు ముందుకేసి కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని మాట్లాడడం గమనార్హం.


Show Full Article
Print Article
Next Story
More Stories