Vinod Kambli Dance Video: ఆస్పత్రిలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి డ్యాన్స్.. వీడియో వైరల్

Vinod Kambli Dance Video: ఆస్పత్రిలో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి డ్యాన్స్.. వీడియో వైరల్
x
Highlights

Vinod Kambli's Dance viral Video: ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ స్టెప్పులేశారు. నర్సులతో చక్‌దే ఇండియా అంటూ...

Vinod Kambli's Dance viral Video: ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ స్టెప్పులేశారు. నర్సులతో చక్‌దే ఇండియా అంటూ హిందీ పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యంతో వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలయ్యారు. థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

గతవారం రోజుల నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారని కూడా ప్రచారం జరిగింది. దాదాపు వారం రోజుల నుండి వైద్య బృందం సమక్షంలో కాంబ్లీ చికిత్స తీసుకుంటున్నారు.

మెదడులోని రక్తం గడ్డకట్టడంతో కాంబ్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సరైన చికిత్స అందించడంతో ఇప్పుడు వినోద్ కాంబ్లీ ఆరోగ్యం కుదుటపడినట్టు తెలుస్తోంది. గతకొన్ని రోజులుగా థానేలోని ఆస్పత్రిలో చేరిన కాంబ్లీ క్రమంగా కోలుకుంటున్నారు. ఇప్పుడు పాటల ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కాంబ్లీ తన గదిలో ఆస్పత్రి సిబ్బందితో కలిసి చక్ దే ఇండియా సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ పాటలు పాడడం చూడొచ్చు.

మరోవైపు తన ఆరోగ్య పరిస్థితిపై కాంబ్లీ ఇటీవల స్పందించారు. వైద్యులు అందిస్తోన్న చికిత్స వల్ల తాను బతికే ఉన్నాను అంటూ హాస్పిటల్ బెడ్‌పై నుంచి స్టేట్‌మెంట్ ఇచ్చారు. చాలామంది కాంబ్లీకి సహాయం అందించేందుకు ముందుకువచ్చారు. దీంతో ఆయన థానేలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. స్వయంగా కాంబ్లీకి వీరాభిమాని అయిన హాస్పిటల్ ఇన్‌ఛార్జి కూడా కాంబ్లీకి ఎటువంటి ఫీజులు లేకుండానే పూర్తి చికిత్స అందిస్తానని ప్రకటించారు. కాంబ్లీ కోలుకునే వరకు చూసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వినోద్ కాంబ్లీ.. తన ఆరోగ్యం బాగుందని.. తనకు ఎలాంటి ప్రాబ్లంలేదని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇలా డ్యాన్స్ చేశారని తెలుస్తోంది. ఇక కాంబ్లీ డ్యాన్స్‌కు ఫిదా అయిన నర్సులు కూడా ఆయనతో కలిసి స్టెప్పులేశారు.

ఒకప్పుడు క్రికెట్‌లో బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుని.. అంతే వేగంగా టీమ్‌కు దూరమైనవాళ్లు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారిలో అందరికీ గుర్తుండే వ్యక్తి వినోద్ కాంబ్లీ. సచిన్ టెండూల్కర్‌తో కలిసి స్కూల్ క్రికెట్ ఆడిన ఈ లెజెండరీ బ్యాట్స్‌మెన్, చిన్న వయసులోనే నేషనల్ టీమ్‌లో సెన్సేషన్‌గా మారారు. 1988లో శారదాశ్రమ్ విద్యా మందిర్ తరఫున తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్‌తో కలిసి 664 పరుగుల రికార్డ్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో కాంబ్లీ 349 స్కోర్ చేశాడు.

స్కూల్ క్రికెట్ హిస్టరీలో ఇదే టాప్ పార్ట్‌నర్‌షిప్‌గా ఎన్నో సంవత్సరాలు నిలిచింది. వినోద్ 1991లో షార్జాలో పాకిస్థాన్‌పై ఫస్ట్ వన్డే ఆడారు. 1993లో ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో చాలా దూకుడైన ఆటతీరుతో ఆ జనరేషన్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేశారు. కానీ ఆ తర్వాత గాయాలు, వ్యక్తిగత సమస్యల కారణంగా ఫామ్ కోల్పోయి క్రికెట్‌కు దూరమయ్యారు. కాంబ్లీ 1995లో చివరి టెస్ట్ మ్యాచ్, 2000లో చివరి వన్డే ఆడారు.

ఇటీవల ముంబైలో దివంగత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో క్రికెట్స్ లెజెండ్స్ పాల్గొన్నారు. ఈ పొగ్రామ్‌కు హాజరైన వినోద్ కాంబ్లీ కనీసం నడవలేని స్థితిలో కనిపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనకు ఏమైందని అందరూ చర్చించుకున్నారు. ఈ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ కూడా హాజరయ్యారు. కాంబ్లీ.. టెండూల్కర్ చేతిని పట్టుకుని వదలకుండా అలాగే మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మళ్లీ ఇప్పుడిలా హాస్పిటల్లో డాన్స్ చేస్తూ (Vinod Kambli's Dance viral video) మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories