T20 World Cup: యూఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్

UAE to Host T20 World Cup from Oct 17 to Nov 14
x

T20 World Cup:(The Hans India) 

Highlights

T20 World Cup: ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను యూఏఈ వేదికగా నిర్వహించడానికి ఐసీసీ తుది నిర్ణయం తీసుకున్నది.

T20 World Cup: ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను యూఏఈ వేదికగా నిర్వహించడానికి బీసీసీఐ తుది నిర్ణయం తీసుకున్నది. క్వాలిఫయింగ్ పోటీలు అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానుండగా.. సూపర్ 12 మ్యాచ్‌లు అక్టోబర్ 24 నుంచి యూఏఈలో జరుగుతాయి. ఈ మేరకు క్రీడా వెబ్‌సైట్ 'క్రిక్ఇన్ఫో' ఒక కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి జూన్ 28 వరకు గడువు ఇచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యూఏఈనే బెటర్ ఛాయిస్ అని బీసీసీఐ భావించింది. బీసీసీఐ తమ నిర్ణయాన్ని చెప్పక ముందే అనధికారికంగా షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు కథనంలో పేర్కొన్నారు.

యూఏఈలోని మూడు వేదికలు – అబుదాబి, షార్జా, దుబాయ్ లో టీ20 పోటీలు నిర్వహించనున్నారు. అలాగే టీ20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లకు ఒమన్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం. యూఏఈలో ఐపీఎల్ ఫైనల్ (అక్టోబర్ 15) ముగిసిన రెండు రోజుల తర్వాత టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది. నవంబర్ 14న ఫైనల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వారంలో రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. యూఏఈలోని దుబాయ్, అబుదాబి. షార్జా వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదే వేదికల్లో ప్లేఆఫ్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories