Paris Olympics 2024: భారత్ ఖాతాలోకి మరో రెండు పతకాలు?ఇవాళ్టి షెడ్యూల్ ఇదే
Paris Olympics 2024:పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కాంస్య పతకంతో మెరిచింది. ఇవాళ మరో రెండు మెడల్స్ భారత ఖాతాలో చేరే అవకాశం ఉంది. ఏయే ఈవెంట్లలో మెడల్స్ వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కాంస్య పథకంతో ఖాతా ఓపెన్ చేసింది. నేడు షూటింగ్ లో మరో రెండు మెడల్స్ భారత్ ఖాతాలో చేరే అవకాశం ఉంది.
ఒలింపిక్స్ జులై 29 షెడ్యూల్ ఇదే:
బ్యాడ్మింటన్ : మెన్స్ డబుల్స్(సాత్విక్-చిరాగ్ × మార్క్-మెర్విన్) - మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది
ఉమెన్స్ డబుల్స్ (అశ్విని-తనీషా × నమి-చిహారు) - మధ్యాహ్నం 12.50 గంటలకు షురూ అవుతుంది.
మెన్స్ సింగిల్స్ (లక్ష్యసేన్ × జులియన్) - సాయంత్రం 5.30గంటలకు ఉంది.
షూటింగ్ : 10మీ.ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ (మను-సరబ్‌జోత్, రిథమ్-అర్జున్ చీమా) - మధ్యాహ్నం 12.45, మెన్స్ ట్రాప్ క్వాలిఫికేషన్ (పృథ్వీరాజ్) - మధ్యాహ్నం 1గంటలకు ఉంది.
హాకీ : భారత్ × అర్జెంటీనా - సాయంత్రం 4.15లకు ఉంది.
టేబుల్ టెన్నిస్ : ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్ (శ్రీజ × జియాన్)- రాత్రి 11.30గంటలకు ఉంది.
పతకాలు ఎందులో వచ్చే అవకాశముందంటే?
షూటింగ్ : 10మీ.ఎయిర్ రైఫిల్ ఉమెన్స్ ఫైనల్ (రమిత) - మధ్యాహ్నం 1, మెన్స్ ఫైనల్ (అర్జున్ బబుతా) - మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభం అవుతుంది
ఆర్చరీ : మెన్స్ టీమ్ క్వార్టర్స్ (తరుణ్‌దీప్, బొమ్మధేవర ధీరజ్(విజయవాడ), ప్రవీణ్) - సాయంత్రం 6.30, మెడల్ రౌండ్లు- రాత్రి 8.18గంటలకు ప్రారంభం అవుతుంది
డైవింగ్ : మెన్స్ సింక్రనైజ్డ్ 10మీ ప్లాట్‌ఫామ్ ఫైనల్ - మధ్యాహ్నం 2.30గంటలకు ప్రారంభం అవుతుంది
స్కేట్ బోర్డింగ్ : మెన్స్ స్ట్రీట్ ఫైనల్ - రాత్రి 8.30గంటలకు ప్రారంభం అవుతుంది
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ - మెన్స్ టీమ్ ఫైనల్ - రాత్రి 9గంటలకు ప్రారంభం అవుతుంది
స్విమ్మింగ్ : ఉమెన్స్ 400మీ. వ్యక్తిగత మెడ్లీ ఫైనల్ - రాత్రి 12, మెన్స్ 200మీ.ఫ్రీస్టైల్ ఫైనల్ - రాత్రి 12.10గంటలకు ప్రారంభం అవుతుంది
జోరుమీదున్న ఆసీస్ - ఒలింపిక్స్ మెడల్స్ టేబుల్లో టాప్ పొజిషన్ కోసం అమెరికా, చైనా ఎక్కువగా పోటీలో ఉన్నాయి. కానీ ఈ సారి మాత్రం ఆస్ట్రేలియా జోరు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతానికి ఆసీస్ 4 గోల్డ్ మెడల్స్, 2 రజతాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. కాంస్యంతో భారత్ 22వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire