రెండు పొరపాట్లు చాలు మ్యాచ్ జారిపోవడానికి : కోహ్లీ

రెండు పొరపాట్లు చాలు మ్యాచ్ జారిపోవడానికి : కోహ్లీ
x
Highlights

న్యూజిలాండ్ తో మరికొద్ది సేపట్లో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఆడబోతోంది టీమిండియా. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈరోజు మ్యాచ్ లో...

న్యూజిలాండ్ తో మరికొద్ది సేపట్లో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఆడబోతోంది టీమిండియా. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈరోజు మ్యాచ్ లో ఒత్తిడిని ఎదుర్కోవడమే కీలకమని కోహ్లీ చెప్పాడు. ఇరు జట్ల పైనా ఒత్తిడి అధికంగానే ఉంటుందన్నాడు. అయితే, ఒత్తిడిని జయించిన జట్టే విజయం సాధించడానికి అవకాశం ఉంటుందని తెలిపాడు. ఒత్తిడిలో పొరపాట్లు చేస్తాం. రెండు పొరపాట్లు చాలు మ్యాచ్ మన చేయి జారిపోవడానికి. చెడన చేయాల్సివస్తే ఈ ఒత్తడి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో రెండు పొరపాట్లు చేస్తే మ్యాచ్ ప్రత్యర్థి చేతిలోకి వెళ్ళిపోతుంది. కోలుకోవడం కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఎన్నో మ్యాచులు చూసిన తరువాత తానీ మాట చెబుతున్నానన్నాడు.

'టాస్‌ విషయానికి వస్తే అది మన చేతుల్లో లేదు, దాని గురించి పెద్దగా చింతించాల్సిన పనిలేదు. కాబట్టి ఆ విషయాన్ని పట్టించుకోవద్దు. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం టీమిండియా అలాగే ఆడుతుంది. టాస్ ఓడిపోయినంత మాత్రాన వెనుకపడినట్లు కాదు, మన మీద మనకు నమ్మకం ఉండి, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి' అని కోహ్లీ తెలిపాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories