Test Reocrds: టెస్ట్ క్రికెట్‌లో పరుగుల వరద పారించింది వీరే.. జాబితాలో ముగ్గురు భారత దిగ్గజాలు..!

top Five run Scorer in Test Cricket; Sachin Tendulkar Ricky Ponting Rahul Dravid Jacques Kallis Alastair Cook Know Stats
x

Test Reocrds: టెస్ట్ క్రికెట్‌లో పరుగుల వరద పారించింది వీరే.. జాబితాలో ముగ్గురు భారత దిగ్గజాలు..!

Highlights

Test Reocrds: టెస్ట్ క్రికెట్‌లో కొన్ని రికార్డులు ఇప్పటి వరకు అలాగే ఉండిపోయాయి. ఎంతోమంది ప్లేయర్లు వచ్చి వెళ్తున్నా.. ఆ రికార్డులు మాత్రం అలానే ఉంటున్నాయి.

Test Reocrds: టెస్ట్ క్రికెట్‌లో కొన్ని రికార్డులు ఇప్పటి వరకు అలాగే ఉండిపోయాయి. ఎంతోమంది ప్లేయర్లు వచ్చి వెళ్తున్నా.. ఆ రికార్డులు మాత్రం అలానే ఉంటున్నాయి. అలాంటి వాటిలో అత్యధిక పరుగుల జాబితా కూడా ఉంటుంది. ఈ లిస్టులో టాప్ 5 జాబితాను తీసుకుంటే అందులో భారత్ నుంచి లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ ఉన్నారు. ఈ లిస్టులో భారత ఆటగాళ్లు సత్తా చూపించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాప్రికా నుంచి ఒక్కొక్కరు ఈ లిస్టులో చోటు సందపాదించుకున్నారు.

క్రికెట్ దిగ్గజ ఆటగాళ్ళలో ఒకరైన భారత మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ రికార్డును చేరుకున్న వారు లేకపోవడం విశేషం. సచిన్ 1989, 2013 మధ్య మొత్తం 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో లిటిల్ మాస్టర్ 53.78 సగటుతో 15921 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 15,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా లిటిల్ మాస్టర్ సచిన్ నిలిచాడు. ఈ భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ టెస్టుల్లో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు చేశాడు.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్ 1995 నుంచి 2012 వరకు టెస్ట్ క్రికెట్ ఆడాడు. అతను 168 టెస్టు మ్యాచ్‌ల్లో 51.85 సగటుతో 13378 పరుగులు చేశాడు. పాంటింగ్ తన టెస్ట్ కెరీర్‌లో 41 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలు సాధించాడు.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్ కలిస్ మూడో స్థానంలో ఉన్నాడు. కల్లిస్ 1995 నుంచి 2013 మధ్య 166 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు 55.37 సగటుతో 13,289 పరుగులు చేశాడు. ఈ సమయంలో కల్లిస్ పేరుపై 45 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.

భారత మాజీ ఆటగాడు, ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా టెస్ట్ క్రికెట్‌లో అనేక రికార్డులను కలిగి ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ద్రవిడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 1996 నుంచి 2012 వరకు ప్రైవేట్‌లో టెస్ట్ క్రికెట్ ఆడాడు. 164 టెస్టు మ్యాచ్‌ల్లో 13,288 పరుగులు చేశాడు. ద్రవిడ్ తన టెస్టు కెరీర్‌లో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు సాధించాడు.

ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఐదో స్థానంలో ఉన్నాడు. కుక్ 2006 నుంచి 2018 వరకు టెస్టు క్రికెట్ ఆడాడు. అలిస్టర్ కుక్ 161 టెస్టుల్లో 12472 పరుగులు సాధించాడు. కుక్ తన కెరీర్‌లో 33 సెంచరీలు, 57 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో అలిస్టర్ కుక్ ఒకడిగా నిలిచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories