Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియన్‌ హాకీ జట్టు రికార్డు

Tokyo Olympics : India Reach Semis in Womens Hockey
x

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియన్‌ హాకీ జట్టు రికార్డు

Highlights

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియన్‌ హాకీ జట్టు రికార్డు సృష్టించింది.

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియన్‌ హాకీ జట్టు రికార్డు సృష్టించింది. మూడు సార్లు ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ జట్టు ఆసీస్‌ను ఓడించింది. ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్‌లో 1-0 తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఒక్క గోల్‌ కూడా చేయకుండా ఆసీస్‌ను భారత మహిళల హాకీ జట్టు నిలువరించింది. 22వ నిమిషం దగ్గర గుర్జీత్‌ కౌర్‌ గోల్‌ చేసింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌కు భారత మహిళల హాకీ జట్టు దూసుకెళ్లింది. 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు ఈ సారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది.

లీగ్ దశలో వరుసగా మ్యాచులు ఓడిన టీమిండియా ఆ తర్వాత జైత్రయాత్ర ప్రారంభించింది. రెండు వరుస గెలుపులతో క్వార్టర్స్‌కు చేరిన భారత జట్టు బలమైన ప్రత్యర్థితో తలపడింది. రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగగా రెండు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. అయితే ఆస్ట్రేలియాకు ఒక్క గోల్ కొట్టే ఛాన్స్ ఇవ్వకుండా చుక్కలు చూపింది రాణీ సేన. సెకండ్ క్వార్టర్ లో ఒక గోల్ సాధించాక ఆసీస్‌ను ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా దెబ్బతీసింది. స్ట్రైకర్లు, డిఫెన్స్‌ టీమ్ రాణించడంతో విజయం సొంతం చేసుకుని చరిత్ర లిఖించింది భారత జట్టు. భారత హాకీ మహిళల జట్టుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories