Thisara Perera: అంతర్జాతీయ క్రికెట్‌కు తిషారీ పెరీరా గుడ్‌ బై

Thisara Perera Retires International Cricket
x

Thisara Perera: క్రికెట్‌కు తిషారీ పెరీరా గుడ్‌ బై (ఫొటో పెరీరా ట్విట్టర్)

Highlights

hisara Perera: శ్రీలంక క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ తిషారా పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Thisara Perera: శ్రీలంక క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ తిషారా పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం వెల్లడించాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్‌(ఎస్‌ఎల్‌సీ)కి పెరీరా తెలియజేశాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' శ్రీలంకకు నేను ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్పగా భావిస్తున్నాను. ఓవరాల్‌గా 7 క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో శ్రీలంక తరఫున ఆడాను. 2014లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఘనత' అని ఎస్‌ఎల్‌సీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు.

తిషారా పెరీరా గురించి కొన్ని విశేషాలు:

  1. జననం: 3 ఏప్రిల్ 1989, కొలంబో, శ్రీలంక
  2. భార్య: Sherami Perera
  3. ఆల్ రౌండర్ (All-Rounder)
  4. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ (Left-Handed Batsman)
  5. ODI Debut: 24 డిసెంబర్ 2009 vs ఇండియా
  6. Last ODI: 14 మార్చి 2021 vs వెస్ట్ ఇండీస్
  7. Test Debut: 26 మే 2011 vs ఇంగ్లాండ్
  8. T20I Debut: 3 మే 2010 vs జింబాబ్వే
  9. శ్రీలంక తరఫున 6 టెస్టులు మాత్రమే ఆడిన పెరీరా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం 166 వన్డేలు, 84 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.
  10. ఐపీఎల్‌లో 37 మ్యాచ్‌లు ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో 2,338 పరుగులు చేసిన పెరీరా.. టీ20ల్లో 1204 పరుగులు చేశాడు.
  11. ఇక వన్డేల్లో 175 వికెట్లు సాధించిన పెరీరా.. అంతర్జాతీ టీ20ల్లో 51 వికెట్లు తీశాడు.
  12. శ్రీలంక తరఫున ఏడు క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో ఆడాడు.
  13. 2014లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
Show Full Article
Print Article
Next Story
More Stories