Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట

Third Gold Medal to India in Tokyo Paralympics
x

షూటింగ్ విభాగం లో మనీష్ కు గోల్డ్ మెడల్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Tokyo Paralympics: భారత్‌ ఖాతాలోకి మూడో స్వర్ణం * షూటింగ్‌లో స్వర్ణం, రజతం కైవసం చేసుకున్న ఇండియా

Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారులు జోరు కొనసాగిస్తున్నారు. దీంతో భారత్‌కు వరుసగా పతకాలు వస్తున్నాయి. ఇప్పటికే 13 పతకాలు భారత్ సాధించగా తాజాగా మరో రెండు మెడల్స్ వచ్చాయి. షూటింగ్ విభాగంలో ఇండియాకు గోల్డ్, సిల్వర్ పతకం వరించింది.

షూటింగ్ P4 మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ SH1 విభాగంలో మనీష్ నర్వాల్ స్వర్ణం గెలుచుకోగా సింఘ రాజ్ వెండి పతాకాన్ని గెలుచుకున్నాడు. దీంతో భారత్ పతకాల సంఖ్య 15 కు చేరింది. అటు భారత బ్యాడ్మింటన్ స్టార్ సుహాస్ యతిరాజ్ కూడా బ్యాడ్మింటన్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. Sl -4 కేటగిరీలో భారత స్టార్ ప్లేయర్ సుహాస్ ఇండోనేషియా ప్లేయర్ ఆర్.సి రెడ్డి పై వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లాడు. దీంతో భారత్ కి మరో రజతాన్ని ఖాయం చేశాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories