World Cup 2023: సెమీస్ రేసులో ఉత్కంఠ.. మిగతా 3 ప్లేస్‌ల కోసం 5 జట్ల పోరు.. ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..!

The Indian Team That Entered The Semi Finals
x

World Cup 2023: సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత జట్టు.. లీగ్‌లో మిగిలింది 11 మ్యాచులు మాత్రమే

Highlights

World Cup 2023: చివరి దశకు చేరుకున్న వరల్డ్‌కప్ లీగ్‌ స్టేజ్‌

World Cup 2023: వన్డే వరల్డ్‌కప్‌ లీగ్‌ లాస్ట్ స్టేజ్‌కు వచ్చింది. ఇప్పటికే భారత జట్టు అధికారికంగా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్, శ్రీలంక, నెదర్లాండ్స్‌ కూడా టోర్నీ నుంచి బయటకు వెళ్లిపోవడం దాదాపు ఫిక్స్ అయింది. ఇక మిగిలింది ఐదు జట్లు. ఈ ఐదు జట్లలో మిగతా మూడు బెర్తులు దక్కించుకునేది ఎవరు..? సెమీస్ రేసులో ఏ జట్టు ఎవరితో తలపడనుంది..? ఇప్పటికే సెమీస్ బెర్త్ ఫిక్స్ అయిన ఇండియా ఎవరితో ఆడనుంది..? అనే ఉత్కంఠ నెలకొంది.

నిన్నటివరకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు వెళ్లడం ఖాయంగా కనిపించింది. అయితే నిన్నటి మ్యాచుతో అనూహ్యంగా ఆఫ్ఘాన్ జట్టు సెమీస్ రేసులోకి వచ్చింది. సెమీస్ బెర్తు కోసం పోటీ పడే అయిదు జట్లలో ఆఫ్గనిస్థాన్‌ ఒకటి. ఏడు మ్యాచ్‌ల్లో నాలుగో విజయం సాధించిన అఫ్గాన్‌.. పెద్ద జట్లతో పాటుగా సెమీస్‌ రేసులో నిలిచి ఆశ్చర్యపరిచింది. ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. టోర్నీలో అలాంటి విజయాలు సాధిస్తూనే ఉంది. శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్ చతికిలపడ్డ చోట ఆ జట్టు సంచలనాలు నమోదు చేస్తోంది. ఇప్పుడు సెమీస్‌ బెర్తును కూడా సొంతం చేసుకుని సెన్షేషన్ క్రియేట్ చేసే ఛాన్స్‌ ఉందా? అనే ఆసక్తి నెలకొంది.

ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా దాదాపుగా సెమీస్‌ చేరినట్లే. ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ కూడా మెరుగ్గా ఉంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా ముందంజ వేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో కూడా ఆ జట్టు రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 6 మ్యాచ్‌ల్లో 4.... న్యూజిలాండ్‌ 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మ్యాచులు గెలిచి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 7 మ్యాచ్‌ల్లో 3 నెగ్గిన పాక్‌ నిన్నటిదాకా అయిదో స్థానంలో ఉండగా...అఫ్గానిస్థాన్‌ నాలుగో విజయం సాధించి ఐదో ప్లేస్‌కి వెళ్లింది.

కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్థాన్‌ ప్రదర్శన చూస్తే.. శ్రీలంక, బంగ్లాదేశ్‌ లాంటి టీమ్‌లను ఓడించేలానే ఉంది. కానీ ఆ జట్టు అంచనాలను మించి... అనూహ్య ప్రదర్శనతో ఆందరినీ ఆశ్చర్యపరిచింది. చివరి 3 మ్యాచ్‌ల్లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్‌లను ఓడించడంతో అఫ్గాన్‌ను ఇప్పుడు అందరూ సీరియస్‌గా తీసుకుంటున్నారు. అదే ప్రదర్శన కొనసాగించి, అదృష్టం కలిసొస్తే ముందంజ వేసినా వేయొచ్చని భావిస్తున్నారు. న్యూజిలాండ్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం అఫ్గాన్‌లో ఆశలు పెంచుతోంది. దక్షిణాఫ్రికాతో పాటు మంచి ఊపులో ఉన్న ఆస్ట్రేలియా రెండు సెమీస్‌ బెర్తులు సొంతం చేసుకుంటాయనుకుంటే.. సమీకరణాలు కలిసొస్తే అఫ్గాన్‌ ముందంజ వేయొచ్చు.

చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలను ఢీకొనబోతోంది. ఈ రెండు జట్లను ఓడించడం కష్టమైనా.. అఫ్గాన్‌ ఒక్క మ్యాచ్‌లో సంచలనం సృష్టించినా.. అవకాశాలు మెరుగవుతాయి. అదే సమయంలో పాకిస్థాన్, శ్రీలంకతో తలపడబోతున్న కివీస్‌.. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. లేదా ఒక్క మ్యాచ్‌ ఓడినా.. నెట్‌రన్‌రేట్‌లో అఫ్గాన్‌ కన్నా వెనుకబడాలి. మరోవైపు ఆస్ట్రేలియా వరుసగా ఓడిపోయినా.. అఫ్గాన్‌కు ఛాన్సుంటుంది. కానీ అఫ్గాన్‌కు నెట్‌రన్‌రేట్‌ తక్కువ ఉండటం మైనస్‌.

ఇందులో మిగతా జట్లను అధిగమించడం అంత తేలిక కాదు. అందుకే ఈ సమీకరణాలన్నీ సాధ్యపడి అఫ్గాన్‌ సెమీస్‌కు చేరడం చాలా కష్టంగానే కనిపిస్తోంది. కానీ టోర్నీలో ఇప్పటిదాకా వచ్చిన ఫలితాలను బట్టి చూస్తుంటే మాత్రం ఏదైనా జరగొచ్చని అనిపిస్తోంది. ఇక బెర్తులు కన్ఫామ్ అయితే.. టాప్‌-1, టాప్‌-4 జట్ల మధ్య ఫస్ట్ సెమీస్.. టాప్‌-2, టాప్‌-3 జట్ల మధ్య సెకండ్ సెమీస్ జరగనుంది. దీంతో టాప్‌లో ఉండే టీమ్స్ ఏవి..? ఏ టీమ్ ఎవరితో తలపడనుందనే ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories