Thailand Open 2021: థాయ్‌లాండ్ ఓపెన్‌లో గందరగోళం.. కిదాంబి శ్రీకాంత్ ముక్కులో నుంచి రక్తం

Thailand Open 2021: థాయ్‌లాండ్ ఓపెన్‌లో గందరగోళం.. కిదాంబి శ్రీకాంత్ ముక్కులో నుంచి రక్తం
x
కిదాంబి శ్రీకాంత్ ఫైల్ ఫోటో 
Highlights

బ్యాంకాక్ వేదికగా జరుగుతున్నథాయ్‌లాండ్ ఓపెన్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.

బ్యాంకాక్ వేదికగా జరుగుతున్నథాయ్‌లాండ్ ఓపెన్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. భారత స్టార్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌కి చేదు అనుభవం ఎదురైంది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఆడేందుకు శ్రీకాంత్ అక్కడికి వెళ్లాడు. థాయ్‌లాండ్ ఓపెన్‌ నిర్వాహకులు క్రీడాకారులందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే శ్రీకాంత్ కరోనా టెస్టు శ్రీకాంత్ శాంపిల్స్ సేకరిస్తున్న నిర్వాహకులు దురుసు ప్రవర్తన కారణంగా కిదాంబి శ్రీకాంత్‌ ముక్కుకి గాయమైంది.

దాదాపు 10 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ భారత షట్లర్లు ఈ టోర్నీలో ఆడనున్నారు. టోక్యో ఒలింపిక్స్ సన్నద్ధత కోసం ఈ టోర్నీని వినియోగించుకోవాలని భారత షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్, కశ్యప్, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఆశించారు. కానీ.. తాజాగా కరోనా పరీక్షల్లో సైనా నెహ్వాల్‌కి పాజిటివ్‌గా తేలింది. దీంతో సైనా నెహ్వాల్ ను నిర్వహకులు క్వారంటైన్‌కి తరలించారు. కానీ.. కోవిడ్ టెస్టు నివేదిక ఇవ్వలేదని వాపోతోంది.

తాజాగా కిదాంబి శ్రీకాంత్‌‌కి గాయమైంది. కిదాంబి శ్రీకాంత్ ముక్కు వెంట రక్తం కారుతున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వాహకుల తీరుపై విమర్శలు గుప్పించాడు. నిర్వహకులు తనతో వ్యవహరించిన తీరు సరిగాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. టోర్నీకి ముందే తాను నాలుగు సార్లు కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్న విషయాన్ని గుర్తు చేశాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories