Rafael Nadal loses Farewell Match : ఓటమితో ముగిసిన టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కెరీర్

Tennis legend Rafael Nadals career ended in defeat
x

Rafael Nadal loses Farewell Match : ఓటమితో ముగిసిన టెన్నిస్ దిగ్గజం రఫెన్ నాదల్ కెరీర్

Highlights

Rafael Nadal loses Farewell Match : టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ తన కెరీర్ లో చివరి మ్యాచ్ లో ఓడిపోయారు. డేవిస్ కప్ లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్...

Rafael Nadal loses Farewell Match : టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ తన కెరీర్ లో చివరి మ్యాచ్ లో ఓడిపోయారు. డేవిస్ కప్ లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ ఓటమి పాలవ్వడం వల్ల రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. డేవిస్ కప్ లో ఓటమితో సుదీర్ఘ కెరీర్ ను ప్రారంభించిన నాదల్ పరాజయంతో తన కెరీర్ ను ముగించేశాడు. కాగా డేవిస్ కప్ తో ఆటకు వీడ్కోలు పలుకుతానని నాదల్ అక్టోబర్ లో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ డేవిస్ కప్ సమయంలో స్పెయిన్, నెదర్లాండ్స్ జట్ల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కన్ను మాత్రం నాదల్ పైనే నిలిచింది. కోర్టులో అతను ఆడిన ప్రతి షాట్ ను ప్రతి కదలికను ఎంతో ఆసక్తిగా, ఎంతో ఇష్టంగా తిలకించారు అభిమానులు. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆ యోధుడి ఆటను ఇకపై చూసే అవకాశం లేకపోవడం..అతడికిదే చివరి మ్యాచ్ అవడం గమనార్హం. అందుకే అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా అతని ఆటను వీక్షించారు.

నాదల్ కూడా తీవ్ర భావోద్వేగాల మధ్య బరిలోకి దిగాడు. కానీ ఒకప్పటి ఫిట్‌నెస్, ఫామ్ లేని కారణంగా అతను తొలి సింగిల్స్ లో మ్యాచ్ లో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. నాదల్ 4-6, 4-6తో బొటిక్ వాన్ డి జాండ్ షల్ప్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. కాగా గత కొంత కాలంగా నాదల్ గాయాలతో సతమతం అవుతున్నారు.

దీంతో ఈ ఏడాది నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మూడింటిలో పాల్గొనలేకపోయాడు. డేవిస్ కప్ నకు ముందు చివరగా ప్యారిస్ ఒలింపిక్స్ లో బరిలోకి దిగాడు. కానీ అక్కడ నాదల్ నిరాశేపరిచాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ ల సెర్బియా స్టార్ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు.

మొత్తంగా రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్స్ టైటిల్లను తన అకౌంట్లో వేసుకున్నాడు. 14సార్లు ఫ్రెంచ్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్ రెండు సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ లలో ఛాంపియన్ గా నిలిచాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories