IPL 2025 Auction: ఐపిఎల్ వేలంలో స్టార్ క్రికెటర్లను బీట్ చేసిన తెలుగు క్రికెటర్లు ఎవరో తెలుసా?

IPL 2025 Auction: ఐపిఎల్ వేలంలో స్టార్ క్రికెటర్లను బీట్ చేసిన తెలుగు క్రికెటర్లు ఎవరో తెలుసా?
x
Highlights

Telugu cricketers Prices in IPL 2025: ఐపిఎల్ 2025 హంగామా మొదలైంది. ఐపిఎల్ టోర్నీలో మొట్టమొదటి అడుగైన వేలం ప్రక్రియ కూడా ముగిసింది. అబుదాబిలోని జడ్డా...

Telugu cricketers Prices in IPL 2025: ఐపిఎల్ 2025 హంగామా మొదలైంది. ఐపిఎల్ టోర్నీలో మొట్టమొదటి అడుగైన వేలం ప్రక్రియ కూడా ముగిసింది. అబుదాబిలోని జడ్డా వేదికగా జరిగిన ఈ ఐపిఎల్ వేలంలో 182 మంది ఆటగాళ్ల పేర్లు వేలానికి వచ్చాయి. తమ జట్లకు అవసరమైన ఆటగాళ్లను కొనేందుకు ఫ్రాంచైజీలు మొత్తం రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఈసారి ఐపిఎల్ వేలంలో చెప్పుకోదగిన ప్రత్యేకత ఏంటంటే... వేలంలో ఉన్న 182 మంది ఆటగాళ్లలో 10వ వంతు ఆటగాళ్లు తెలుగు క్రికెటర్లే ఉన్నారు. ఔను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఐపిఎల్ వేలంలో పాల్గొన్న క్రికెటర్లకు కళ్లు చెదిరే డిమాండ్ కనిపించింది. కొంతమంది సీనియర్స్, స్టార్ ఇమేజ్ ఉన్న క్రికెటర్స్ కంటే ఈ యువ తెలుగు క్రికెటర్లే ఎక్కువ ధర పలికారు.

మొహమ్మద్ సిరాజ్ ఎంత పలికాడు? తిలక్ వర్మ కోసం ఏ ఐపిఎల్ ఫ్రాంచైజీ ఎంత వెచ్చించింది? వైజాగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని ఈసారి ఎవరు ఎంతకు దక్కించుకున్నారనే ఇంట్రస్టింగ్ డీటేల్స్ తెలియాలంటే మనం ఇక ఆలస్యం చేయకుండా నేటి ట్రెండింగ్ స్టోరీలోకి ఎంటర్ అవ్వాల్సిందే.

మొహమ్మద్ సిరాజ్

మొహమ్మద్ సిరాజ్.. హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగిన ఈ ఫాస్ట్ బౌలర్‌కు ఐపిఎల్‌లో భారీ డిమాండ్ ఉంది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మొహమ్మద్ సిరాజ్‌ను దక్కించుకునేందుకు ఈసారి గుజరాత్ టైటాన్స్ బాగా పోటీపడింది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కూడా సిరాజ్‌ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపించాయి. సిరాజ్‌ను కొనేందుకు మూడు జట్లు పోటీపడటంతో జస్ట్ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఆటగాడి ధర ఏకంగా రూ. 12.25 కోట్లకు పెరిగింది. తొలుత గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటాపోటీగా వేలం పాడి సిరాజ్ ధరను రూ. 8 కోట్ల ధర వరకు పెంచాయి. ఆ తరువాత చెన్నై సూపర్ కింగ్స్ వేలం నుండి పక్కకు తప్పుకుంది.

చెన్నై ఫ్రాంచైజీ పక్కకు తప్పుకున్న తరువాత గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోటీ ఏర్పడింది. ఈ పోటీలో అంతిమంగా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ రూ. 12.25 కోట్లు పెట్టి సిరాజ్‌ను సొంతం చేసుకుంది. వేలం పాటలో నెలకొన్న ఈ పోటీ చూస్తేనే ఈ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

తిలక్ వర్మ

ఐపిఎల్‌లో క్రేజ్ ఉన్న మరో హైదరాబాద్ బ్యాట్స్‌మేన్ తిలక్ వర్మ. తిలక్ వర్మను వేలానికి జస్ట్ ముందుగా ముంబై జట్టు రూ. 8 కోట్లకు రీటెయిన్ చేసుకుంది. ఇటీవల జరుగుతున్న ఐపిఎల్ సీజన్స్‌లో తిలక్ వర్మ తన సత్తా చాటుకుని డిమాండ్ ఉన్న ప్లేయర్ అనిపించుకున్నాడు. మ్యాచ్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఒత్తిడికి గురికాకుండా అగ్రెసివ్ స్టైల్లో బ్యాటింగ్ చేయడం తిలక్ వర్మ ప్రత్యేకతగా చెబుతుంటారు.

టీ20 ఫార్మాట్ వరుసగా మూడు సెంచరీలు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మేన్ కూడా తిలక్ వర్మనే కావడం విశేషం. టీ20 ఇన్నింగ్స్ లో 150 ప్లస్ రన్స్ చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్‌మేన్ కూడా తిలకే కావడం అతడి సత్తా ఏంటో చెప్పడానికి ఒక నిదర్శనంగా నిలుస్తోంది.

నితీష్ కుమార్ రెడ్డి

విశాఖపట్నం ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పర్ ఫార్మెన్స్ గురించి కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. చేతికి బాల్ ఇచ్చినా, బ్యాట్ ఇచ్చినా రెచ్చిపోవడమే పనిగా పెట్టుకున్నాడు. అందుకే టీ2 ఫార్మాట్లో ఇటీవల కాలంలో అతడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. నితీష్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 6 కోట్లు పెట్టి రీటెయిన్ చేసుకుంది. 2024 ఐపిఎల్‌లో నితీష్ పర్‌ఫార్మెన్స్ ఆయనకు ఆ తరువాత టీమిండియాలోనూ ఛాన్స్ దక్కేలా చేసింది. దటీజ్ నితీష్ కుమార్ రెడ్డి.

ఈ ఐపిఎల్ వేలంలో మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ,నితీష్ కుమార్ రెడ్డి పలికిన ధరలు వారి సీనియర్స్ కంటే చాలా ఎక్కువ. ఐపిఎల్‌లోకి వీళ్లకంటే ముందే ఎంట్రీ ఇచ్చి సీనియర్స్ అజింక్య రహానే, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య లాంటి ఆటగాళ్లు కూడా అంత ధర పలకలేదు.

షేక్ రషీద్

గుంటూరు పేరు చెబితే గుంటూరు కారం గుర్తుకొస్తుంది. అలాగే ఐపిఎల్ ఫాలో అయ్యే వారికి షేక్ రషీద్ కూడా గుర్తుకొస్తాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు షేక్ రషీద్ ను 30 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. రషీద్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. గతేడాది కూడా ఆయన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలోనే ఉన్నాడు. ఈ ఏడాది కూడా ఆ జట్టు మరోసారి అతడిని సెలెక్ట్ చేసుకుందంటే.. అది వారికి అతడిపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది.

సత్యనారాయణ రాజు

కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ జట్టు రూ. 30 లక్షలు పెట్టి సొంతం చేసుకుంది.డొమెస్టిక్ క్రికెట్ లో రాణిస్తున్న రాజుకు ఇదే తొలి ఐపిఎల్ సీజన్. పేస్ బౌలింగ్ లో రాజు దిట్ట. అందుకే ముంబై ఇండియన్స్ జట్టు ఆయన్ను సెలెక్ట్ చేసుకుంది.

త్రిపురాన విజయ్

డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్న మరో క్రికెటర్ త్రిపుర విజయ్. అందుకే శ్రీకాకుళానికి చెందిన త్రిపుర విజయ్ పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశలు పెట్టుకుంది. రూ. 30 లక్షలు పెట్టి వేలం పాటలో విజయ్ ని సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్పిన్ బౌలింగ్ కు విజయ్ కూడా ఒక అసెట్ అవుతాడని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ప్లాన్ చేసుకుంటోంది.

పైలా అవినాష్

ఏపి డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్న మరో యువ కెరటం పైలా అవినాష్. విశాఖపట్నానికి చెందిన ఈ యువ క్రికెటర్ ను పంజాబ్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. ఈ ఆల్ రౌండర్ కోసం పంజాబ్ కింగ్స్ జట్టు రూ. 30 లక్షలు వెచ్చించింది.

అమ్ముడుపోని ఆటగాళ్లు

కె.ఎస్. భరత్

ఐపిఎల్ కెరీర్లో తెలుగు క్రికెటర్లు అత్యధిక ధర పలకడం, లేదా కొత్త వారికి అవకాశం రావడం గుడ్ మూమెంట్స్‌లా కనిపించింది. అదే సమయంలో ఇంకొంతమంది ఆటగాళ్లు ఐపిఎల్ ఫ్రాంచైజీలను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. ఆంధ్రా రంజి టీమ్ నుండి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మేన్ కె.ఎస్. భరత్ కూడా ఆ జాబితాలో ఉన్నాడు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోసం ఆడిన కే.ఎస్. భరత్ ఈసారి అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయారు.

బైలపూడి యశ్వంత్

ఆంధ్రా జట్టుకే చెందిన బైలపూడి యశ్వంత్ డొమెస్టిక్ క్రికెట్లో ఆకట్టుకుంటున్నప్పటికీ, ఐపిఎల్ మాత్రం ఫ్రాంచైజీలు ఆయన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు.

ఆరవెల్లి అవనిష్

తెలంగాణ జట్టుకు చెందిన ఆరవెల్లి అవినాష్ కూడా టాలెంటెడ్ రంజీ ప్లేయర్స్ లో ఒకరు. కానీ ఐపిఎల్ 2025 ఆడే భాగ్యం మాత్రం అవినాష్ కు దక్కలేదు. అలా భరత్, యశ్వంత్, అవనిష్ మాత్రమే కాదు.. మొత్తం 11 మంది తెలుగు ఆటగాళ్లు అమ్ముడవని ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఆమాటకొస్తే.. వీళ్లే కాదు.. ఐపిఎల్ టోర్నీల్లో ప్రువెన్ ట్రాక్ రికార్డు ఉన్న డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, పృథ్వీ షా, శార్ధుల్ థాకూర్, జానీ బెయిర్‌స్టో, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, స్టీవ్ స్మిత్ లాంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఉన్నారు.

మొత్తంగా ఈ 2025 ఐపిఎల్ కోసం ఐపిఎల్ ఫ్రాంచైజీలు వేలంలో పోటీపడి మరీ ఐదుగురు ఆటగాళ్లను దక్కించుకున్నాయి. తిలక్, నితీష్ కుమార్ రెడ్డిని ఆయా జట్లు రీటెయిన్ చేసుకున్నాయి. ఈ తెలుగు క్రికెటర్లు వచ్చే ఏడాది ఐపిఎల్‌లో చెలరేగిపోవాలని, తెలుగు గడ్డకు మరింత గొప్ప పేరు తేవాలని మనం కూడా మనస్పూర్తిగా కోరుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories