ODI World Cup 2023: హైదరాబాద్‌లో ప్రపంచకప్ ఫీవర్.. ఉప్పల్ వేదికగా 6, 9,10 తేదీల్లో మ్యాచ్‌లు

Teams Of Pakistan And Netherlands Will Face Each Other Tomorrow
x

ODI World Cup 2023: హైదరాబాద్‌లో ప్రపంచకప్ ఫీవర్.. ఉప్పల్ వేదికగా 6, 9,10 తేదీల్లో మ్యాచ్‌లు

Highlights

ODI World Cup 2023: స్టేడియంలో షీ టీమ్స్ ఆఫీసర్ల నిఘా

ODI World Cup 2023: ఐసీసీ వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లు ఇవాళ ప్రారంభమయ్యాయి. రేపు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్ నెదర్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు అన్ని ఏర్పాటు చేశారు. వరల్డ్ కప్‌లో భాగంగా ఉప్పల్లో మూడు మ్యాచులు జరుగుతాయి. ఈనెల 6, 9,10 తేదీల్లో వరల్డ్ కప్ మ్యాచులకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా నెదర్లాండ్స్ జట్టులో తెలుగు యువకుడు పాకిస్తాన్‌‌తో తలపడనున్నారు. కాగా రాచకొండ సీపీ చౌహన్ వచ్చి స్టేడియాన్ని పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. కాసేపటి క్రితమే పాకిస్తాన్ టీమ్ సైతం గ్రౌండ్‌ చేరుకుంది.

ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఆటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాచకొండ సీపీ చౌహాన్ అన్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు సజావుగా సాగుతాయని తెలిపారు. టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్‌ ఆయన మాట్లాడారు. 12 వందల మంది పోలీసులతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. మెయిన్ మ్యాచుల సమయంలో కొన్ని డైవర్లను ఏర్పాటు చేస్తామని సీపీ తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తామని తెలిపారు. షీ టీమ్ ఆఫీసర్లు మఫ్టీలో ఉంటారని తెలిపారు. సీసీ కెమెరాలు అన్ని కలిపి కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని చౌహాన్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటల నుంచి అనుమతిని ప్రారంభిస్తామని సీపీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories