India Vs England: ప్రపంచంలో ఉత్తమ పేస్ దళం టీం ఇండియా సొంతం: కోహ్లీ
India Vs England:పేస్ బౌలింగ్ లో అత్యుత్తమైన బౌలర్లు టీం ఇండియాకు సొంతమని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.
India Vs England:పేస్ బౌలింగ్ లో అత్యుత్తమైన బౌలర్లు టీం ఇండియాకు సొంతమని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మూడో టెస్ట్ జరిగే మొతెరా పిచ్ పేస్ కు అనుకూలిస్తే ఇంగ్లాండ్ టీందే పై చేయి సాధింస్తున్న వార్తలను ఈ మేరకు ఖండించాడు. స్వింగ్ కు అనుకూలించిన ఇంగ్లాండ్ పిచ్ లపై మేం గెలిచామని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. రేపటి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య డే/నైట్ టెస్టు జరగనుంది. ఈ సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
''ఇంగ్లాండ్ జట్టు వారి బలాలు, బలహీనతల గురించి ఆలోచించట్లేదనుకుంటా. పేస్ బౌలింగ్ కు అనుకూలించే వాళ్ల సొంత గ్రౌండ్ లోనే వాళ్లని ఓడించి సత్తా చాటాం. సమిస్ఠిగా పోరాడి విజయాలు సాధించాం. ఇక వీక్ నెస్ ల విషయాని వస్తే.. ప్రత్యర్థి జట్టులో అవి చాలానే ఉన్నాయి. వాటిని ఉపయెగించుకోవడానికి రెడీగా ఉన్నాం. పేస్ పిచ్ ఇంగ్లాండ్ కు అనుకూలంగా ఉంటే అది మాకు లాభమే. ఎందుకంటే ఇతర జట్ల కంటే బలమైన బౌలర్టు మా టీంలోనూ ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా బెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం'' అని కోహ్లీ అన్నాడు.
''పింక్ బాల్ తో ఆడటం సవాలే. ముఖ్యంగా సాయంత్రం బ్యాటింగ్ చేసే జట్టుకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో మొదటి గంటన్నర సేపు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది. అయితే బంతిపై షైన్ ఉన్నంతవరకు ఫాస్ట్ బౌలర్లకు కూడా సహకరిస్తుంది'' అని పేర్కొన్నాడు. మరో గెలుపు సాధిస్తే స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన ధోనీ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ''రికార్డులు మారిపోతుంటాయి. బయటినుంచి ఇద్దరు వ్యక్తులను పోల్చడం బాగుంటుంది. కానీ అలాంటి విషయాల్ని మేం అసలు పట్టించుకోం. తోటి ప్లేయర్స్ గా మాజీ కెప్టెన్ ధోని పై మాకు ఎంతో గౌరవం, ప్రేమ ఉంటాయి'' అని అన్నాడు.
అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పై మాట్లాడుతూ..''ఒక మ్యాచ్ డ్రా చేసి, మరొకటి గెలవాలని మేం అనుకోవట్లేదు. మిగతా రెండు మ్యాచ్‌లూ మాకు ముఖ్యమే. వాటిలో గెలవాలని ప్రయత్నిస్తున్నాం. రిజల్ట్ గురించి తర్వాత ఆలోచిస్తాం'' అని కోహ్లీ వెల్లడించాడు. సిరీస్‌ను భారత్ 2-1 లేదా 3-1తో గెలిస్తే ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ చెరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన గత డే/నైట్ టెస్టులో టీమిండియా 36 పరుగులకు కుప్పకూలింది. ఆ ఫలితం ఏమైనా ప్రభావితం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు.. ''45 నిమిషాల చెత్త ఆటతో అలా జరిగింది. అలాంటి చేదు జ్ఞాపకమే ఇంగ్లాండ్‌కు కూడా ఉంది. క్రికెట్ లో ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు కదా'' అని అన్నాడు. 2018లో న్యూజిలాండ్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ 58 పరుగులకు ఆలౌటైంది.
Who doesn't love the crowd 🤗🤗
— BCCI (@BCCI) February 23, 2021
We are happy to have the support of #TeamIndia 🇮🇳 fans and it shall be no different at Motera 🏟️ @imVkohli #INDvENG @paytm pic.twitter.com/6m1TJPPmZu
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire