India vs Pakistan: ఆసియా కప్ క్రికెట్ పోటీల్లో టీమిండియా పరాజయం

Team India Lost in Asia Cup Cricket 2022
x

India vs Pakistan: ఆసియా కప్ క్రికెట్ పోటీల్లో టీమిండియా పరాజయం

Highlights

India vs Pakistan: సూపర్ 4లో పాకిస్థాన్‌తో పోరాడి ఓడిన భారత్

India vs Pakistan: బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ... కోట్లాది మంది ఆకాంక్ష నెరవేరింది. ఆసియా కప్‌ పోటీల్లో టీమిండియా జయించింది. భరతమాత పులకించింది. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్, టీమిండియాల మధ్య జరిగిన సూపర్4 హోరాహోరీ పోరును తలపించింది. టీమిండియా అన్ని విభాగాల్లోనూ రాణించింది. సూపర్‌4లో టీమిండియా విజయభేరి మోగించింది.

ఆసియా కప్ క్రికెట్ పోటీల్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు లోకేశ్ రాహుల్, రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. పవర్ ప్లేలో ఆశాజనకంగా పరుగులు సాధించారు. రోహిత్ శర్మ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో పెవీలియన్ బాటపట్టాడు. లోకేశ్ రాహుల్‌కు జోడీగా వచ్చి విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశారు. కాసేపటికే లోకేశ్ రాహుల్ పెవీలియన్ బాట పట్టాడు. అయినప్పటికీ రన్ రేట్ మాత్రం పదికి తగ్గనీకుండా రాణించారు.

సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, దీపక్ హుడా క్రీజులో కుదురుకునే ప్రయత్నంకంటే, భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించడంతో క్యాచ్‌ల రూపంలో వెనుదిరిగారు. దీంతో రన్ రేట్ క్రమేణ తగ్గిపోయింది. మరో వైపు విరాట్ కోహ్లీ తనదైన శైలిలో పరుగులు రాబట్టుకునే ప్రయత్నంలో సఫలమయ్యారు. అర్థశతకాన్ని పూర్తిచేసి, టీమిండియాకు గౌరవ ప్రదమైన స్కోరు సాధించిపెట్టారు. ఆఖరి ఓవర్లో కోహ్లీ రనౌట్ కావవడంతో క్రీజులోకి వచ్చిన బౌలర్ రవి బిష్ణోయ్‌ ఆఖరి రెండు బంతుల్ని బౌండరీలుగా మలచి టీమిండియా స్కోరును 180 పరుగులు దాటించారు. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 60 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టన్ రోహిత్ శర్మ 16 బంతుల్లో మూడు బౌండరీలు, రెండు సిక్సర్లతో 28 పరుగులు, లోకేశ్ రాహుల్ 20 బంతుల్లో ఒక బౌండరీ, రెండు సిక్సర్లతో 28 పరగులు, దీపక్ హుడా16 పరుగులు, రిషబ్ పంత్ 14 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులు అందించారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 181 పరుగులు చేసింది.

182 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకిదిగిన పాకిస్థాన్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆరంభ ఓవర్లోనే రెండు బౌండరీలతో దూకుడు పెంచింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో కెప్టన్ బాబర్ ఆజం భారీషాట్ కొట్టబోయి క్యాచ్ రూపంలో పెవీలియన్ బాటపట్టాడు. ఫకర్ జమాన్, రిజ్వాన్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఫకర్ జమాన్ పెవీలియన్ బాట పట్టిన తర్వాత రిజ్వాన్, నవాజ్ మెరుపు షాట్లతో విజయలక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రయత్నించారు. భారతీయ క్రికెట్ అభిమానుల్లో విజయంపై ఆశలు సన్నగిల్లాయి. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో నవాజ్ ఔటయ్యాడు. ఆతర్వాత హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో రిజ్వాన్ పెవీలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత భారత్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. క్యాచ్ మిస్‌లు, అపరాదపు పరుగులతో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. 19 ఓవర్లో ఒక సిక్సర్, రెండు బౌండరీలతో మ్యాచ్ మలుపు తిరిగింది. విజయం పాకిస్థాన్ వైపు మొగ్గుచూపింది.

ఆసియా కప్ క్రికెట్ పోటీల్లో సూపర్ 4లో భారత జట్టు వీరోచితంగా పోరాడి పరాజయాన్ని చవిచూసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్, టీమిండియా తలపడ్డాయి. టాస్ ఓడిన టిమిండియా, మ్యాచ్‌ను చేజార్చుకుంది. మైదానంలో తప్పిదాలు... పరాజయానికి కారణమయ్యాయి. ఒత్తిడికి గురైన టీమిండియా బౌలర్లు పదునైన బంతులు సంధించడంలో విఫలమై భారీ పరుగులు సమర్పించుకున్నారు. దీంతో టీమిండియా పరాజయం పాలైంది.

ఆఖరి ఓవర్ ఉత్కంఠ రేకెత్తించింది. ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి ఒక పరుగు, రెండో బంతికి బౌండరీతో పాకిస్థాన్ విజయం దాదాపు ఖామమైపోయింది. మూడో బంతి డాట్ బాల్ కాగా నాలుగో బంతికి ఆసిఫ్ అలీ ఎల్బీ డబల్ల్యూగా వెనుదిరిగాడు. రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా, సూపర్ ఓవర్ కు దారితీస్తుందేమోనని భావించారు. ఐదో బంతికి రెండు పరుగులు సాధించి లక్ష్యాన్ని అధిగమించారు. ఒక బంతి మిగిలి ఉండగానే పాకిస్థాన్ గెలుపు గుర్రమెక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories