India Vs Engalnd: కష్టాల్లో టీం ఇండియా: 10 ఓవర్లకు 48/4

Team India in Trouble for batting
x

బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతోన్న ధావన్ (ఫొటో ట్విట్టర్)

Highlights

India Vs Engalnd:ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు ప్రారంభంమైన మొదటి టీ20లో టీం ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

India Vs Engalnd: ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు ప్రారంభంమైన మొదటి టీ20లో టాస్ ఓడిన టీం ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 5 ఓవర్ల లోపే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రాహుల్, ధావన్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీం ఇండియా..రెండో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ విసిరిన బంతికి రాహుల్ (1 పరుగు 4 బంతులు) బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (0 పరుగులు 5 బంతులు) నిరాశపరిచాడు. మూడో ఓవర్లో రషీద్ బౌలింగ్ జోర్దాన్ కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

అనంతరం బ్యాటింగ్ వచ్చిన పంత్ ధాటిగానే ఆటను ప్రారంభించాడు. 2 ఫోర్లు, 1 సిక్స్ తో బౌలర్లపై విరుచపడ్డాడు. మరోవైపు శిఖర్ ధావన్ కూడా పరుగుల కోసం చాలా కష్టపడ్డాడు. నెమ్మదిగా ఆడుతూ స్ర్టైక్ రొటేట్ చేస్తూ కనిపించాడు. కానీ, 5 ఓవర్లో మార్క్ వుడ్ వేసిన బంతికి ధావన్ (4పరుగులు 12 బంతులు) బౌల్డ్ అయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి 20 పరుగులకు 3 వికెట్లు కోల్పయింది ఇండియా టీం. అనంతరం బ్యాటింగ్ వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి పంత్ ఇన్సింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. అంతలోనే పంత్ (23 బంతులు, 2ఫోర్లు, 1 సిక్స్) 10 ఓవర్లో స్టోక్స్ వేసిన బంతికి బెయిర్‌స్టో కు క్చాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రేయాస్ 22 పరుగుల(16 బంతులు, 3 ఫోర్లు), హర్దిక్ పాండ్య 0 తో బ్యాటింగ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories