MS Dhoni Tests Negative For Covid19: చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ కి రెడీ..ధోనీకి కరోనా నెగెటివ్!

MS Dhoni Tests Negative For Covid19: చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ కి రెడీ..ధోనీకి కరోనా నెగెటివ్!
x
MS Dhoni (file photo)
Highlights

MS Dhoni Tests Negative For Covid19: గత ఏడాది వరల్డ్ కప్ నుంచి భారత్ సెమీఫైనల్ నిష్క్రమించినప్పటి నుంచి ధోని మళ్ళీ జట్టు తరుపున ఆడలేదు.

MS Dhoni Tests Negative For Covid19: గత ఏడాది వరల్డ్ కప్ నుంచి భారత్ సెమీఫైనల్ నిష్క్రమించినప్పటి నుంచి ధోని మళ్ళీ జట్టు తరుపున ఆడలేదు. గత ఏడాది కాలంగా క్రికెట్నుం డి విశ్రాంతి తీసుకున్న ధోని మళ్ళీ జట్టులోకి ఎప్పుడు వస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ధోని మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. అయితే, కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా మార్చి నుంచి రాంచీలోని తన ఫామ్‌ హౌస్‌కే పరిమితమైన ధోని కోవిడ్ టెస్ట్ కోసం బుధవారం వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించింది. ఈ పరీక్షల్లో నెగటివ్ గా నిర్ధారణ అయినట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అధికారికంగా గురువారం ప్రకటించింది. దీంతో శనివారం నుంచి చెన్నైలో ప్రారంభం కానున్న ప్రాక్టీసు మ్యాచ్ కు ధోని హాజరయ్యేందుకు మార్గం సులువైంది.

దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ 13వ సీజన్‌ ప్రారంభం అవుతున్న నేపధ్యంలో యూఏఈకి క్రికెటర్లని పంపే ముందే కనీసం రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు వారికి నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల ఫ్రాంఛైజీలకి ఆదేశించింది. ఇక ధోని విషయానికి వస్తే.. ఈ ప్రాక్టీసు మ్యాచ్ కు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, పీయూస్చా వ్లా, రవీంద్ర జడేజా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఇక ధోని విషయానికి వస్తే.. గత ఏడాది న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత మళ్ళీ ధోని జట్టులో కనిపించింది లేదు.. దాదాపుగా ధోనిని మైదానంలో చూసి 14 నెలలు అయింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌ కి ఆటగాళ్ళు ఆగస్టు 20 లోపే అక్కడికి చేరుకోనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories