అంబ‌టి రాయుడు 3D tweetపై విజయ్ శంకర్ ఫస్ట్ రియాక్ష‌న్..వైర‌ల్

Vijay Shankar 1st Time Responds On Ambati Rayudu 3d Tweet
x

 అంబ‌టి రాయుడు ,విజయ్ శంకర్.

Highlights

Vijay Shankar on 3D Glass Tweet: టీమిండియా ఆట‌గాడు అంబ‌టి రాయుడు త్రీడీ ట్వీట్‌పై తొలిసారి స్పందించాడు

Vijay Shankar on 3D Glass Tweet: టీమిండియా ఆట‌గాడు అంబ‌టి రాయుడు త్రీడీ ట్వీట్‌పై తొలిసారి స్పందించాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్. రాయుడు ట్వీట్ చేసిన త్రీడీతో త‌న‌కేమి సంబంధం లేద‌ని చెప్పుకొచ్చాడు. రాయుడు బ్యాటింగ్ ఆర్డ‌ర్ వేరు.. త‌న బ్యాటింగ్ ఆర్డ‌ర్ వేర‌ని.. ప్ర‌పంచ క‌ప్ లో ఆడిన మూడు మ్యాచుల్లో రాణించాన‌ని తెలిపాడు. దీనిపై విజ‌య్ ఇంకా ఎం మాట్లాడంటే.. త్రీడి ట్విట్ ట్యాగ్ చైస్తూ.. అభిమానులు ప్రతిసారి ఆ త్రీడీని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో నన్ను ఆటపట్టిస్తున్నారు. రాయుడు ఆ ట్వీట్ చేసిన తర్వాత ప్రపంచకప్‌లో నేను మూడు మ్యాచ్‌లాడి.. మెరుగైన ప్రదర్శన కనబర్చా. నేనేమీ తప్పులు చేయలేదు.

ఇక ఐపీఎల్‌లో కూడా నా బ్యాటింగ్ ఆర్డర్ వేరు. అయినప్పటికీ.. చాలా మంది అంబటి రాయుడితో నన్ను పోలుస్తున్నారు. ఇద్దరం ఆడుతున్న పరిస్థితులు, బ్యాటింగ్ ఆర్డర్‌లు వేరు. కానీ.. ఇవేమీ వారు పట్టించుకోవడం లేదు. వాళ్లు నన్ను ట్రోల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు'' అని విజయ్ శంకర్ అన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కి ఫామ్ లో ఉన్న అంబటి రాయుడ్ని పక్కన పెట్టారు భారత సెలెక్టర్లు. రాయుడి స్థానంలో ఆల్ రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ ను ఎంపిక చేసామ‌ని ప్ర‌క‌టించారు. రాయుడికి బదులుగా శంకర్‌ని ఎంపికచేయడంపై అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ ''రాయుడితో పోలిస్తే విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ రూపంలో టీమ్‌కి మూడు కోణాల్లో ఉపయోగపడతాడు. అతను త్రీడీ ప్లేయర్'' అని చెప్పుకొచ్చాడు.

ప్రపంచ కప్ కి తనని ఎంపిక చేయకపోవడంపై రాయుడు ఘాటుగా స్పందించాడు. అంబటి రాయుడు ''వరల్డ్‌కప్‌ని చూసేందుకు ఇప్పుడే కొత్త త్రీడీ గ్లాస్‌లను ఆర్డర్ చేశాను'' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగగా.. ఇప్పటికీ విజయ్ శంకర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు 'త్రీడీ' అంశం తెరపైకి వస్తోంది. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే జట్టు నుంచి వైదొలిగాడు. ఇక ఐపీఎల్ లో రాయుడు చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున అద్బుతంగా రాణిస్తున్నాడు. ప్ర‌పంచ క‌ప్ త‌ర్వాత విజ‌య్ శంక‌ర్ టీమిండియాకు దూరం అయ్యాడు. విజ‌య్ శంక‌ర్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడుతున్నాడు. గ‌త ఏడాది ప‌ర్వాలేద‌నిపించిన విజ‌య్.. ఈ ఏడాది పూర్తిగా విఫ‌ల‌మైయ్యాడు. ఒక మ్యాచ్ లో అయితే విజ‌య్ బ్యాటింగ్, బౌలింగ్ కూడా ఇవ్వాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories