కేటీఆర్‌ను కలిసిన హనుమ విహారి

కేటీఆర్‌ను కలిసిన హనుమ విహారి
x

కేటీఆర్, హనుమ విహారి

Highlights

టీమిండియా క్రికెటర్, తెలుగు కుర్రాడు హనుమ విహారి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా బేటీ అయ్యాడు. ఈ సందర్భంగా ఆసీస్‌ గడ్డపై...

టీమిండియా క్రికెటర్, తెలుగు కుర్రాడు హనుమ విహారి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా బేటీ అయ్యాడు. ఈ సందర్భంగా ఆసీస్‌ గడ్డపై చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్‌ శాలువాతో సన్మానించారు. ఆసీస్‌ పర్యటనకు సంబంధించిన విషయాలను విహారీ కేటీఆర్‌కు వివరించాడు. కేటీఆర్‌ను కలవడం, క్రికెట్ గురించి ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరగడం ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు. అనంతరం కేటీఆర్‌తో దిగిన ఫొటోలను విహారి ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓటమి అంచులో ఉన్న మ్యాచ్ లో అశ్విన్‌తో కలిసి విహారి కడదాకా నిలిచి డ్రాగా ముగించాడు. ఆసీస్‌ బౌలర్లు వరుస బౌన్సర్లతో బెంబెలెత్తించిన.. వీరిద్దరు సమస్ఫూర్తితో బ్యాటింగ్‌ చేసి జట్టును ఓటమినుంచి గట్టెక్కించారు. హనుమ విహారి ప్రదర్శనపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే. అయితే తొడకండరాల గాయం కారణంగా విహారి ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరంకావడంతో ఇటీవల స్వదేశానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం విహారి కేటీఆర్‌ను కలిశాడు.

అస్ట్రేలియా భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు డ్రా ముగిసింది. 407 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్ 334 పరుగలకే పరిమితం అయింది. హనుమ విహారి(23నాటౌట్ 161 బంతుల్లో 4x4), రవిచంద్రన్‌ అశ్విన్‌(39నాటౌట్ 128 బంతుల్లో 7x4) రక్షణాత్మకంగా ఆడడంతో భారత్ ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. వీరిద్దరూ చివరివరకు క్రీజులో పాతుకుపోయి ఆసీస్ బౌలర్ల సహానానికి పరీక్ష పెట్టారు. విహారీ ప్రదర్శన పై సర్వాత్ర ప్రసంశలు జల్లు కురిసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories