IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి పోరుకు సిద్ధమైన భారత్.. ప్లేయింగ్ 11లో వీడని ఉత్కంఠ..

T20 World Cup 2024 IND vs IRE Weather Update Reserve Day Plan New York Playing 11 Stats Records
x

IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి పోరుకు సిద్ధమైన భారత్.. 

Highlights

న్యూయార్క్‌లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.

T20 World Cup 2024, IND vs IRE: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో, టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్‌ని ఈరోజు అంటే జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. వర్షం అభిమానుల మజాను పాడుచేస్తే, వర్షం పడినప్పుడు నియమాలు ఏమిటి, భారత్-ఐర్లాండ్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంచారా లేదా అని తెలుసుకుందాం.

భారత్-ఐర్లాండ్ మ్యాచ్‌లో రిజర్వ్ డే ఉందా లేదా?

న్యూయార్క్‌లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో వర్షం పడితే, గ్రూప్ దశ మ్యాచ్‌ల కోసం ఐసీసీ ఎటువంటి రిజర్వ్ డేని ప్లాన్ చేయలేదు. అలాగే, ఈ మ్యాచ్‌లకు అదనపు సమయాన్ని కేటాయించలేదు. అందువల్ల వర్షం కురిస్తే ఓవర్లు కుదించినా నిర్ణీత గడువులోగా మ్యాచ్ నిర్వహించేందుకు కృషి చేస్తారు. ఈ నేపధ్యంలో వర్షం ఇంకా జోరుగా కొనసాగితే భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది.

వాతావరణం ఎలా ఉంటుంది?

భారత్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య వాతావరణం గురించి మాట్లాడితే , వర్షం పడే అవకాశం 10 శాతం ఉంది. మేఘావృతమైన ఆకాశం కారణంగా గాలిలో 55-60% తేమ ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయానికి అంటే భారత్‌లో రాత్రి 8 గంటల నుంచి (అమెరికాలో ఉదయం 10:30 గంటల వరకు) రాత్రి 11:30 గంటల వరకు (అమెరికాలో మధ్యాహ్నం 1 గంటల వరకు) ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా ఉంటుంది. వాతావరణ శాఖను పరిశీలిస్తే భారత్, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ మొత్తం హ్యాపీగా చూడొచ్చన్నమాట.

ట్రోఫీ గెలిచే దిశగా..

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా గురించి మాట్లాడితే, కోచ్ రాహుల్ ద్రవిడ్ తన చివరి టోర్నమెంట్‌లో ICC ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా అతనికి వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో రోహిత్ శర్మ ఎలాంటి జట్టుతో ఫీల్డింగ్ చేస్తాడో చూడాలి. భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా రూపంలో ఇద్దరు బలమైన ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు. ఓపెనింగ్‌లో విరాట్ కోహ్లీ వస్తాడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

హెడ్ ​​టు హెడ్ రికార్డ్స్: మొత్తంగా ఐర్లాండ్‌తో జరిగిన టీ20ల్లో భారత్ ఆధఇపత్యం చెలాయిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన 7 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సొంతం చేసుకుంది. టీ20 ప్రపంచ కప్‌లలో ఇంతకుముందు 2009లో ట్రెంట్ బ్రిడ్జ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

ఐర్లాండ్: ఆండీ బాల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్/బెన్ వైట్, జోష్ లిటిల్.

Show Full Article
Print Article
Next Story
More Stories