India Vs Afghan: గెలుపుతో బోణి చేస్తారా..? ఓటమితో హ్యాట్రిక్ కొడుతారా..?

T20 World Cup 2021 India Vs Afghanistan Match Preview Today 03rd November 2021 - Cricket News
x

T20 World Cup 2021 - India Vs Afghan: గెలుపుతో బోణి చేస్తారా..? ఓటమిలో హ్యాట్రిక్ కొడుతారా..!?

Highlights

* టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ 2 లో భారత్ - ఆఫ్గనిస్తాన్ మధ్య హోరాహోరి పోరు

T20 World Cup 2021 - India Vs Afghanistan: టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా గ్రూప్ 2 లో నేడు నవంబర్ 3 న (బుధవారం) రాత్రి 7.30 నిమిషాలకు అబుదాభి వేదికగా షేక్ జాయద్ స్టేడియంలో భారత్ - ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, న్యూజిలాండ్ లతో జరిగిన మ్యాచ్ లలో ఘోర ఓటమిపాలై సెమీస్ ఆశలను వదులుకున్న టీమిండియా నేడు ఆఫ్ఘన్ జట్టుతో జరిగే మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది.

మరోపక్క పాకిస్తాన్ చేతిలో ఓడిన.., నమీబియా, స్కాట్లాండ్ జట్లపై ఘన విజయం సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నాలుగు పాయింట్లతో గ్రూప్ 2 లో రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అటు బ్యాటింగ్ తో బౌలింగ్ లో విఫలమైన భారత జట్టులో బుధవారం జరిగే మ్యాచ్ లో మార్పులు చేసే అవకాశం ఉంది. అబుధాబిలోని షేక్ జాయద్ క్రికెట్ స్టేడియంలోనూ మంచు ప్రభావం కీలకంగా మారనుంది.

టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ 2021లో అబుధాబిలో 8 మ్యాచ్ లు జరగగా అందులో 6 మ్యాచ్ లు ఛేజింగ్ చేసిన జట్టు గెలుపొందింది.

మ్యాచ్ వివరాలు:

ఇండియా - ఆఫ్ఘనిస్తాన్

నవంబర్ 3 (బుధవారం) 2021

రాత్రి 7.30 నిమిషాలు

షేక్ జాయద్ క్రికెట్ స్టేడియం, అబుధాబి

హెడ్ టూ హెడ్:

2010, 2012 టీ20 ప్రపంచకప్ లలో భాగంగా రెండు మ్యాచ్ లలో భారత్ - ఆఫ్ఘనిస్తాన్ తలపడగా రెండు మ్యాచ్ లలోనూ టీమిండియా విజయం సాధించింది.

తుది జట్టు వివరాలు ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి..

భారత జట్టు:

ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (సి), రిషబ్ పంత్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

ఆఫ్ఘనిస్తాన్ జట్టు:

హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్ (wk), రహ్మానుల్లా గుర్బాజ్, ఉస్మాన్ ఘని, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ (c), గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్, కరీం జనత్ / ముజీబ్ ఉర్ రెహ్మాన్, హమీద్ హసన్, నవీన్ ఉల్ హక్

Show Full Article
Print Article
Next Story
More Stories