Mumbai Indians: పాండ్యాకు ఊహించని షాక్.. ముంబై కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా స్టార్ ప్లేయర్.. ఎవరంటే?

Suryakumar Yadav Next Mumbai Indians Captain Says Report After Hardik Pandya
x

Mumbai Indians: పాండ్యాకు ఊహించని షాక్.. ముంబై కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా స్టార్ ప్లేయర్.. ఎవరంటే?

Highlights

Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై జట్టు 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకుంది. అయితే, ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ దారుణ పరిస్థితులు ఎదుర్కొంది. ఇదే క్రమంలో హార్డిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకొచ్చి, కెప్టెన్‌గా చేశారు. అదే సీజన్‌లో ముంబై ఫ్లాప్ అయింది.

గత సీజన్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని పాత వైభవం తీసుకరావాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కోరుకుంటోంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. దీంతో ప్రస్తుతం ఉన్న జట్టులో కీలక మార్పులు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ముంబై జట్టులో 3 కీలక మార్పులు చేయనుంది.

రోహిత్ శర్మ గుడ్‌బై: రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ముంబై కెప్టెన్‌గా తనను తొలగించి పాండ్యాను ఎన్నుకోవడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ముంబైకి ఇదే చివరి సీజన్ అంటూ చెప్పడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

అయితే, వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రోహిత్ శర్మ ముంబై ఫ్రాంచైజీని వీడితే.. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లు హిట్‌మ్యాన్‌ను దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని నెలల్లో ఏం జరగనుందో తెలియాల్సి ఉంది.

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తన సారధిని మరోసారి మార్చే అవకాశం ఉందంటూ వార్తల వస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌కు ఇప్పటికే కెప్టెన్‌గా పనిచేసిన సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్సీ రేసులో ముందుంన్నాడు. గత సీజన్‌లో ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఘోరంగా విఫలమవ్వడంతో.. ఈ ఏడాది కెప్టెన్సీలో మార్పు అంశం బయటకు వచ్చింది.

ముంబై కెప్టెన్‌గా బుమ్రా: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ముంబై జట్టును వీడితే.. నూతన కెప్టెన్‌గా టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ముంబై కెప్టెన్‌గా మారే ఛాన్స్ ఉంది. అయితే, ఇందుకు చాలా తక్కువ ఆస్కారం ఉంది. సూర్య ముంబైకి అందుబాటులో లేకపోతే.. జస్‌ప్రీత్ బుమ్రా ముంబై క్యాంప్‌ జట్టుకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories