SRH VS CSK: హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జయకేతనం

Sunrisers Won The IPL Match In Hyderabad
x

SRH VS CSK: హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జయకేతనం

Highlights

SRH VS CSK: చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపు

SRH VS CSK: హైదరాబాద్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ సాధికార విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. 166 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము దులిపింది. 11 బంతులు మిగిలి ఉండగానే జయకేతనాన్ని ఎగురవేసింది. హైదరాబాద్ జట్టులో స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు చేజిక్కించుకున్నాడు. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని చేజిక్కించుకున్న హైదరాబాద్ నాలుగు పాయింట్లతో తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ రెండు విజయాలను నమోదు చేసింది.

ఓపెనర్లు అద్బుతమైన ఆట తీరుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్లలో మార్కరమ్ 36 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్‌తో అర్థశతకాన్ని నమోదుచేశాడు. ఓపెనర్లలో ఒకరైన అభిషేక్ శర్మ 12 బంతుల్లో మూడు బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 37 పరుగులు అందించాడు. ట్రావిస్ హెడ్ దూకుడును ప్రదర్శించి 24 బంతుల్లో మూడు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు అందించాడు. చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న హైదరాబాద్ అలవోకగా విజయ తీరాన్ని చేరింది.

చెన్నై బ్యాట్స్ మెన్లలో శివందుబే 45 పరుగులు, ఆజింక్యా రహానే 35 పరుగులు, రవీంద్ర జడేజా 31 పరుగులు, డేరీ మిచెల్ 13 పరుగులు, కెప్టన్ రుతురాజ్ గైక్వాడ్ 12 పరుగులు చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చెన్నైసూపర్ కింగ్స్ పరుగుల నియంత్రణలో పైచేయి సాధించారు. దీంతో 165 పరుగులకే చెన్నై పరిమితమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories