IPL 2024: కాసేపట్లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్, ముంబై మ్యాచ్

Sunrisers VS Mumbai Match At Uppal Stadium
x

IPL 2024: కాసేపట్లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్, ముంబై మ్యాచ్

Highlights

IPL 2024: ఈ సీజన్ ఐపీఎల్‌లో హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్

IPL 2024: హైదరాబాదీలకు బిర్యానీ అంటే ఎంత మక్కువో అదే స్థాయిలో క్రికెట్ అంటే అన్నా ఇష్టమే. ప్రస్తుతం ఐపీఎల్ నడుస్తుండడంతో నగరమంతా క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. క్రికెట్ అభిమానులంతా ఉప్పల్ బాట పట్టారు. మరికాసేపట్లో సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌ జరగునుంది. ఇప్పటికే ఇరుజట్లకు సంబంధించిన ఫ్యాన్స్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. స్టేడియం పరిసరాలు మొత్తం ఆరెంజ్ మయం అయిపోయింది. ఈ సీజన్‌లో ఉప్పల్ వేదికగా ఏడు మ్యాచ్‌లు జరగనుండగా... కాసేపట్లో తొలి మ్యాచ్‌కు స్టేడియం సిద్ధమైంది.

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ నేపథ్యంలో స్టేడియాన్ని రంగురంగులతో ముస్తాబు చేశారు. క్రికెట్‌ అభిమానులు కూర్చునే సీట్లను సైతం శుభ్ర పరిచారు. ఉప్పల్​స్టేడియంలో జరగనున్న సన్​రైజర్స్​హైదరాబాద్ వర్సెస్​ముంబై ఇండియన్స్​మ్యాచ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. 2 వేల 800 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు వెల్లడించారు. అభిమానులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌ ఉన్నతాధికారులు పర్యావేక్షిస్తున్నారు.

నాలుగు వేల కార్లు, ఆరు వేల బైకుల పార్కింగ్​కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపల ఎవరైనా ఈవ్​టీజింగ్ కు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకునేలా మఫ్టీలో లేడీ పోలీసులు డ్యూటీలో ఉండనున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి ఫ్యాన్స్‌ను స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. ప్రతి ఎంట్రీ గేట్​వద్ద స్కానర్లు పెట్టి... క్షుణ్ణంగా తనికీ చేశాకే లోనికి అనుమతిస్తున్నారు.

ల్యాప్​టాప్​లు, వాటర్​బాటిళ్లు, బ్యానర్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్​గ్యాడ్జెట్లు, సిగరెట్లు, లైటర్లు, కత్తులు, బ్లేడ్లు, ప్లాస్టిక్​వస్తువులు, బైనాక్యూలర్లు, రైటింగ్​పెన్స్, బ్యాటరీలు, హెల్మెట్లు, పెర్​ఫ్యూమ్​బాటిల్స్, ఫుడ్​ఐటమ్స్ స్టేడియంలోకి అనుమతించడం లేదు. రెండు జట్లకు చెందిన అభిమానులతో ఉప్పల్ స్టేడియం అంతా కిక్కిరిసిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories