PBKS vs SRH: పంజాబ్‌పై సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ

Sunrisers Hyderabad Beat Punjab Kings By 2 Runs
x

PBKS vs SRH: పంజాబ్‌పై సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ

Highlights

PBKS vs SRH: 2పరుగుల తేడాతో పంజాబ్‌పై హైదరాబాద్‌ విజయం

PBKS vs SRH: ఐపీఎల్‌లో మరో సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ ఆవిష్కృతమైంది. ముల్లన్ పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో విజయం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ హోరాహోరీగా పోరాడాయి. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ రెండు పరుగుల తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది.

183 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ జట్టు చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా, అశుతోష్ శర్మ రెండు సిక్స్ లతో పరిస్థితిని మార్చేశాడు. దానికి తోడు ఉనద్కట్ వైడ్ లు వేయడంతో పంజాబ్ గెలుస్తుందేమో అనిపించింది.

అయితే, చివరి ఓవర్లో ఉనద్కర్ కొన్ని స్లో డెలివరీలు వేయగా, వాటిని బౌండరీ దాటించడంలో పంజాబ్ బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి రెండు బంతుల్లో 11 పరుగులు కొట్టాల్సిన పరిస్థితిలోనూ ఉనద్కర్ ఓ వైడ్ బాల్ వేసి సన్ రైజర్స్ శిబిరంలో కంగారు పుట్టించాడు. అయితే ఆ తర్వాతి బంతికి సింగిల్ రావడంతో, చివరి బంతికి 9 పరుగులు కొట్టాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని శశాంక్ సింగ్ సిక్స్ కొట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు సన్ రైజర్స్ గట్టెక్కింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్‌ చేయడంతో హైదరాబాద్‌ జట్టు మంచి స్కోర్‌ చేయగాలిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories