Kane Williamson: కేన్‌ విలియమ్సన్‌ ఆడకపోవడంపై సన్‌రైజర్స్ కోచ్ క్లారిటీ

Sunrisers Coach Given Clarity on Kane Williamson not Playing in IPL 2021 Match
x

కేన్‌ విలియమ్సన్‌ ఫైల్ ఫోటో

Highlights

Kane Williamson IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌(కేకేఆర్‌)తో...

Kane Williamson IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌(కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో కీవిస్ కెప్టెన్ కేన్‌ విలియమ్స్ కనిపించపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిపాలైందనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. నబీ స్థానంలో కేన్‌ విలియమ్సన్‌ను తీసుకుంటే ఫలితం మరోలా ఉండేదని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. అయితే కేన్ విలియమ్సన్‌ ఆడకపోవడంపై ఆసీస్‌ మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ జట్టు హెడ్ కోచ్‌ ట్రేవర్ బేలిస్ క్లారిటీ ఇచ్చాడు‌.

ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత విలియమ్స్ న్ ఎడమ చేతికి గాయం అయిందన్నారు. అయితే కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నారని ,అతనికి పూర్తి ఫిట్ నెస్ అవసరమని ట్రేవర్ బేలిస్ తెలిపాడు. విలియమ్స్ న్ ఆడటానికి సిద్ధంగా ఉన్నా పూర్తిగా సన్నద్దం కాలేదన్నారు. మోచేతి గాయంతో చికాకు తెప్పిస్తుంది అతనికి కొంత నెట్ ప్రాక్టీస్ అవసరం అని బేలిస్ చెప్పారు. నెట్స్ లో కేన్ కఠోర ప్రాక్టిస్ చేస్తున్నారని, తర్వాతి మ్యాచ్ లోగా అందుబాటులోకి వస్తాడని సన్‌రైజర్స్ జట్టు హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్ అన్నారు.

కేన్ మోచేతి గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అప్పట్లోనే తెలిపింది. భవిష్యత్తు టోర్నీలలో విలియమ్స్ పాల్గొనడం ముఖ్యమని అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుత సిరీస్‌లను నుంచి అతడికి విలియమ్సన్‌కు విశ్రాంతి కల్పించామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా సిరీస్ పేలవ ఫామ్ కనబరిచిన కేన్ విలియమ్స్ న్‌ను పరీక్షించిన వైద్యులు.. ఎడమ మోచేతిలో చిన్న గాయం ఉన్నట్లు గుర్తించారు. అది మానడానికి అతడికి రీహాబిలిటేషన్ అవసరమని న్యూజిలాండ్ క్రికెట్ మెడికల్ మేనేజర్ డేలే షాకెల్ తెలిపారు. విశ్రాంతి లేకుండా మూడు ఫార్మాట్లలో ఆడటం వల్ల అతని గాయం మరింత పెరిగింది. అది పూర్తిగా నయమవ్వాలంటే అతనికి తగిన విశ్రాంతితో పాటు రిహాబిలిటేషన్ అవరసమని చెప్పిన సంగతి తెలిసిందే.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌(కేకేఆర్‌)తో చేతిలో 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు సాధించింది. నితీశ్‌ రాణా (80), రాహుల్‌ త్రిపాఠి (53) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. సన్‌రైజర్స్‌ రషీద్‌ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులే పరిమితం అయ్యింది. మనీశ్‌ పాండే (61 నాటౌట్), బెయిర్‌స్టో (55) హాఫ్ సెంచరీలతో పోరాడినా హైదరాబాద్‌కు విజయన్ని చేకూర్చలేకపోయారు. ఆఖరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా.. రసెల్‌ 11 పరుగులే ఇచ్చాడు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీయగా.. కమిన్స్‌, షకీబుల్, రస్సెల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories