IPL 2020 Telugu Commentary Panel: తెలుగు కామెంటేట‌ర్‌గా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే

IPL 2020 Telugu Commentary Panel: తెలుగు కామెంటేట‌ర్‌గా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే
x

Star-studded commentary panel for IPL 2020 announced,  

Highlights

IPL 2020 Telugu Commentary Panel: యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. అబుదాబి, దుబాయ్, షార్జా వేదికల్లో 53 రోజుల పాటు 60 మ్యాచ్‌లను బీసీసీఐ జరగబోతున్నాయి.

IPL 2020 Telugu Commentary Panel: యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. అబుదాబి, దుబాయ్, షార్జా వేదికల్లో 53 రోజుల పాటు 60 మ్యాచ్‌లను బీసీసీఐ జరగబోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండటంతో టీవీ వ్యూవర్‌షిప్ ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉందని స్టార్‌ స్పోర్ట్స్ అంచనా వేస్తోంది. స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళంలో కామెంట్రీ చెప్పే వ్యాఖ్యాతల జాబితాని తాజాగా విడుదల చేసింది.

తెలుగు కామెంటేటర్ జాబితాలో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ చోటు దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెస్కే.. తన వ్యాఖ్యానంతో తెలుగు అభిమానులను అలరించనున్నాడు. మరో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిస్ శ్రీకాంత్‌ కూడా తమిళంలో కామెంట్రీ చెప్పుబోతున్నాడు.

ఐపీఎల్ 2020కి తెలుగులో కామెంట్రీ చెప్పే జాబితాలో ఎమ్మెస్కే ప్రసాద్ సహా మరో ఏడుగురు కూడా ఉన్నారు. ఎం ఆనంద్ శ్రీ కృష్ణ, ఎం నేహా, కౌశిక్ నలన్ చక్రవర్తి, ఎం ఆశిష్ రెడ్డి, వెంకటపతి రాజు, వై వేణుగోపాలరావు, ఎమ్మెస్కే ప్రసాద్, డి కళ్యాణ్ కృష్ణలు తెలుగులో కామెంట్రీ చెప్పనున్నారు. ఇక బీసీసీఐ కామెంట్రీ ఫ్యానల్‌ నుంచి వేటుకి గురైన సంజయ్ మంజ్రేకర్‌కి షాక్ తగిలింది. స్టార్‌ స్పోర్ట్స్ అతనికి అవకాశం ఇవ్వలేదు. సునీల్‌ గావస్కర్‌, హర్ష భోగ్లే, ఎల్ శివరామకృష్ణన్, మురళీ కార్తీక్, దీప్ దాస్‌గుప్తా, రోహన్ గవాస్కర్, అంజుమ్ చోప్రా వంటి భారత అగ్రశ్రేణి కామెంటేట‌ర్‌గా వ్యాఖ్యానం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories