SLvBAN: తొలి వికెట్‌‌కి 208 పరుగుల భాగస్వామ్యం; 11 ఏళ్ల తర్వాత తొలిసారి

Srilanka vs Bangladesh Test Match Creates Double Century Patnership
x

శ్రీలంక బ్యాట్స్‌మెన్స్ (ఫొటో ట్విట్టర్)

Highlights

SL Vs BAN: బంగ్లాదేశ్ తో ఆరంభమైన రెండో టెస్టులో శ్రీలంక ధాటిగా ఆడుతోంది. భారీ స్కోర్ దిశగా శ్రీలంక పయనిస్తోంది.

SL Vs BAN: బంగ్లాదేశ్ తో ఆరంభమైన రెండో టెస్టులో శ్రీలంక ధాటిగా ఆడుతోంది. భారీ స్కోర్ దిశగా శ్రీలంక పయనిస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన శ్రీలంకను ఓపెనర్లు దిముత్‌ కరుణత్నే (190 బంతుల్లో 118, 15 ఫోర్లు), లహిరు తిరిమన్నె (253 బంతుల్లో 131 బ్యాటింగ్‌; 14 ఫోర్లు) సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 291 పరుగులు చేసింది.

అయితే, ఈ మ్యాచ్ లో కరుణరత్నే, తిరిమన్నె తొలి వికెట్‌కు 209 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. 2011 తర్వాత శ్రీలంక ఓపెనర్లు తొలి డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం క్రియోట్ చేసింది. ఈ రికార్డును స్వదేశంలో 21 ఏళ్ల తర్వాత ఈ ఘనతను సాధించడం విశేషం.

కరుణరత్నే 165 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో అతడికిది 12వ శతకం. అంతేకాకుండా టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని కూడా అతను అందుకున్నాడు. మరో ఓపెనర్‌ తిరిమన్నె 212 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. ఫెర్నాండో 81 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం డిక్వెల్లా 62, మెండీస్ 18 పరుగులతో క్రీజులు ఉన్నారు.

ఇక బంగ్లాదేశ్ బౌలర్లు అహ్మద్ 3 వికెట్లు, హసన్, ఇస్లాం, తైజుల్ ఇస్లాం తలో వికెట్ కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories