IPL2021: శ్రీశాంత్‌కు నో ప్లేస్..లిస్ట్‌లో సచిన్ కొడుకు..ఏంపర్లేదు 8ఏళ్లు వేచిచూశా: శ్రీశాంత్

Sreesanth ignored for Ipl
x

శ్రీశాంత్ , అర్జున్ టెండూల్కర్ 

Highlights

భారత జట్టు సీనియర్ బౌలర్ కేరళ స్పీడస్టర్‌ శ్రీశాంత్‌ ఈ సారి ఐపీఎల్‌లో నిరాశేమిగిలింది.

భారత జట్టు సీనియర్ బౌలర్ కేరళ స్పీడస్టర్‌ శ్రీశాంత్‌ ఈ సారి ఐపీఎల్‌లో నిరాశేమిగిలింది. ఐపీఎల్‌–2021 వేలంలో పాల్గొనే క్రికెటర్ల లిస్ట్ బీసీసీఐ ప్రకటించింది. ఈ జాబితాలో శ్రీశాంత్ కు చోటుదక్కలేదు. ఇటీవలే టీమిండియా పాస్ట్ బౌలర్ కేరళ స్పీడస్టర్‌ శ్రీశాంత్‌ ఏడేళ్ల నిషేధం పూర్తి చేసుకొని ముస్తాక్‌ అలీ ట్రోపీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ట్రోఫీలో శ్రీశాంత్‌ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఈ సారి ఐపీఎల్ సీజన్ 14 వేలంలో పాల్గొనేందుకు 1,114 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో ఫ్రాంచైజీల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఈ జాబితాలో శ్రీశాంత్‌కు చోటు దక్కలేదు. సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌కు జాబితాలో ఉన్నాడు.‌

ఈ నేపథ్యంలో శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2021లో ఏదైనా అద్భుతం జరిగి అవకాశం వచ్చినా అసలు వదులుకోను. అందుకు యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేలే ఓ మంచి ఉదాహరణ. ఐపీఎల్ 2011 సీజన్‌లో గేల్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ ఆ తర్వాత అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అవకాశం కోసం ఎదురుచూస్తా. ఒకవేళ ఆడే ఛాన్స్ వస్తే నేనేంటో నిరూపించుకుంటా' అని శ్రీశాంత్‌ ధీమా వ్యక్తం చేశాడు.

వేలంలో గరిష్టంగా 61 స్థానాలు ఖాళీలు ఉండగా, ఇందులో 22 మంది విదేశీ ఆటగాళ్లను 8 జట్లు ఎంచుకోవచ్చు. అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో 13 స్థానాలు ఖాళీ ఉన్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులో మూడు స్థానాలు ఖాళీ ఉన్నట్టు తెలిసింది. భారత్‌ నుంచి హర్భజన్‌, కేదార్‌ జాదవ్‌, విదేశీ ఆటగాళ్లు స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ కనీస రూ.2 కోట్ల జాబితాలో ఉన్నారు. ఇటీవాలే కేంద్ర నిర‌్ణయంతో ఐపీఎల్ 2020 నుంచి 'వివో'స్పాన్సర్‌గా తప్పుకుంది. 2020 ఐపీఎల్‌కు డ్రీమ్ 11 సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. తాజా బీసీసీఐ నిర్ణయం ప్రకారం చూస్తే.. 'వివో' ఐపీఎల్‌–2021 చైనా మొబైల్‌ కంపెనీ 'వివో'నే మళ్లీ స్పాన్సర్‌గా ఉండనున్నట్లు సమాచారం.

2005లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్‌ టీమిండియా తరపున 27 టెస్టులు, 57 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 2013 ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పట్లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న శ్రీశాంత్‌ తన సహచర క్రికెటర్లైన అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాతో కలిసి బుకీలను కలిసినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్‌తో పాటు మిగతా ఇద్దరి ఆటగాళ్లపైన జీవితకాల నిషేదం విధించింది. 2008 నుంచి 13 వరకు 44 ఐపీఎల్ మ్యాచులు ఆడి 40 వికెట్లు పడగొట్టాడు.

అయితే తాను నిర్దోషినంటూ శ్రీశాంత్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీశాంత్ పై విధించిన నిషేదం గత ఏడాది సెప్టెంబర్ లోనే ముగిసింది. శ్రీశాంత్ మళ్లి టీమిండియాలోకి వస్తాడని అతని అభిమానులు భావిస్తున్నారు

శ్రీశాంత్ ఐపీఎల్ లోకి తిరిగి వస్తాడని అభిమానులు భావించారు. ఈ సారి శ్రీశాంత్ ను బీసీసీఐ పట్టించుకోకపోవడంతో అభిమానులు నిరాశకుగురైయ్యారు. సచిన్ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌కు షార్ట్ లీస్ట్ లో స్థానం దక్కింది. దీంతో అతన్ని ముంబై లేదా బెంగళూరు జట్లు వేలంలో దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories