Sports Year Ender 2024: ఐసీసీ ట్రోఫీ కల నెరవేరిన తరుణం... టీమిండియా ప్లేయర్ల ప్రదర్శన 2024లో ఎలా ఉందంటే..?

Sports Roundup in 2024 for Indian Cricket Team
x

Sports Year Ender 2024: ఐసీసీ ట్రోఫీ కల నెరవేరిన తరుణం... టీమిండియా ప్లేయర్ల ప్రదర్శన 2024లో ఎలా ఉందంటే..?

Highlights

Sports Year Ender 2024: 2024 సంవత్సరం ముగింపుకు వస్తోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు బాగా కలిసి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Sports Year Ender 2024: 2024 సంవత్సరం ముగింపుకు వస్తోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు బాగా కలిసి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 11 ఏళ్ల కరువుకు ముగింపు పలికినట్టుగా ఐసీసీ ట్రోఫీని (T20 ప్రపంచ కప్ 2024) భారత జట్టు గెలుచుకుంది. చివరగా 2013లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఐసీసీ టోర్నీని నెగ్గింది భారత జట్టు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తన ట్రోఫీని సాధించి కరువును తీర్చుకుంది. మరోవైపు జట్టు ఆటగాళ్లు కూడా కొన్ని ఒడిదుడుకులకు లోనయ్యారు. టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గుడ్ బై చెప్పారు. భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యారు. ఈ ఏడాది వార్తల్లో నిలిచిన కొందరు స్టార్ ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.

సూర్య కుమార్ యాదవ్

ఈ ఏడాది భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా సెలక్ట్ అయ్యారు. 2024లో ఇప్పటివరకు టీమిండియా తరఫున సూర్య కుమార్ యాదవ్ మొత్తం 18 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 17 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన తను 26.81 సగటుతో 429 పరుగులు సాధించాడు. ఈ సమయంలో అతను నాలుగ హాఫ్ సెంచరీలు సాధించాడు. అలాగే సౌతాఫ్రికాను దాని సొంతగడ్డపై టీ20 సిరీస్ లో ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.

రోహిత్ శర్మ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 37 ఇన్నింగ్స్‌ల్లో 33.29 సగటుతో 1132 పరుగులు సాధించాడు. ఈ కాలంలో అతను మూడు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే ధోనీ తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించిన కెప్టెన్ గా రికార్డులకెక్కాడు.

విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 22 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 29 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశారు. 22.62 సగటుతో 611 పరుగులు తీశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ప్రస్తుత ఆసీస్ సిరీస్ లోనూ అంతకుముందు జరిగిన న్యూజిలాండ్ సిరీస్ లోనూ ఈ స్టార్ బ్యాటర్ విఫలమయ్యాడు.

హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా 2024లో టీమ్ ఇండియా తరఫున ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 14 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హార్దిక్ 44.00 సగటుతో 352 పరుగులు సాధించాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. 16 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి, హార్దిక్ 26.25 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు. అందులో బెస్ట్ 3/20. ఇక టీ20 ప్రపంచకప్ లో అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ సత్తాచాటి నిజమైన ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. ఈ ఏడాది వీరు లైమ్ లైట్ లో నిలిచారు.

అలాగే 2024లో క్రికెట్ కు మొత్తం 12 మంది ఆటగాళ్ల వీడ్కోలు పలికారు..

- విరాట్ కోహ్లీ – టీ20 నుండి రిటైర్మెంట్

- రోహిత్ శర్మ – టీ20 నుండి రిటైర్మెంట్

- రవీంద్ర జడేజా - టీ20 నుండి రిటైర్మెంట్

- సౌరభ్ తివారీ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్

- వరుణ్ ఆరోన్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్

- దినేష్ కార్తీక్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్

- కేదార్ జాదవ్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్

- శిఖర్ ధావన్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్

- బరీందర్ సరన్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్

- రిద్ధిమాన్ సాహా – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్

- సిద్ధార్థ్ కౌల్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్

- ఆర్ అశ్విన్ – అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్

Show Full Article
Print Article
Next Story
More Stories