ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు‌ సస్పెండ్

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు‌ సస్పెండ్
x
Highlights

దక్షిణాఫ్రికా జాతీయ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు‌ (సిఎస్‌ఎ) ను గురువారం సస్పెండ్ చేస్తూ ..

దక్షిణాఫ్రికా జాతీయ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు‌ (సిఎస్‌ఎ) ను గురువారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది, గతకొంతకాలంగా జట్టు ఎంపికలో నీలినీడలు కమ్ముకున్నాయని.. ఆటగాళ్ల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.. దీంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ విషయాన్నీ సీరియస్ గా పరిగణించి ఆ దేశ క్రికెట్ బోర్డుని సస్పెండ్ చేసింది. ఈ మేరకు దక్షిణాఫ్రికా స్పోర్ట్స్ కాన్ఫెడరేషన్ మరియు ఒలింపిక్ కమిటీ (సాస్కోక్) నుండి సిఎస్ఎకు లేఖ రాసింది. అందులో సిఎస్ఎ బోర్డు మరియు బోర్డులో ఎక్స్-అఫిషియోలో పనిచేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ (కంపెనీ సెక్రటరీ, యాక్టింగ్ సిఇఓ, సిఎఫ్ఓ మరియు సిఒఓ అధికారులు వెంటనే తమ పదవుల నుంచి వైదొలగాని ఆదేశాలు జారీ చేసింది.

బోర్డులో అవకతవకలు చోటుచేసుకోవడం క్రికెట్ వాటాదారులు, స్పాన్సర్లు మరియు సాకా (దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్) ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల విశ్వాసాన్ని కోల్పోయేలా చేసిందనడంలో సందేహం లేదని.. కొందరి చర్యలతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ కు అపఖ్యాతి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన దక్షిణాఫ్రికా.. కనీసం గ్రూప్ దశని కూడా దాటలేకపోయింది. టోర్నీలో 9 మ్యాచ్‌లాడిన ఆ టీమ్ మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. అప్పటినుంచి జట్టు ఎంపికలో అవకతవకలు జరిగాయని బోర్డుమీద ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై ఒక విచారణ కమిటీని కూడా నియమించిన ప్రభుత్వం ఫైనల్ గా క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు‌ (సిఎస్‌ఎ) ను రద్దు చేసేలా సంచలన నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories