నేడు ఏపీ హైకోర్టులో స్కిల్‌ కేసు విచారణ

Skill Development Scam Case Hearing In AP High Court
x

నేడు ఏపీ హైకోర్టులో స్కిల్‌ కేసు విచారణ

Highlights

*మ.2.30 గంటలకు చంద్రబాబు బెయిల్‌పై విచారణ

AP High Court: ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు ఇప్పటికే ముగిశాయి. హైకోర్టులో నిన్న జరిగిన విచారణలో.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను ఈ మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో, చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories